శ్రామిక రైళ్లో శిశువు ఆకలి తీర్చాలని ఇంట్లో పాలు తీసుకొచ్చిన మహిళా పోలీసు అధికారి 

  • Edited By: srihari , June 17, 2020 / 09:59 AM IST
శ్రామిక రైళ్లో శిశువు ఆకలి తీర్చాలని ఇంట్లో పాలు తీసుకొచ్చిన మహిళా పోలీసు అధికారి 

దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులనిచ్చింది కేంద్రం.. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు ఈ శ్రామిక్ రైళ్లలోనే తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రామిక్ రైల్లో  ప్రయాణిస్తున్న ఓ నాలుగు నెలల పసికందు ఆకలితో ఉంది. 

ఆ విషయం తెలిసిన ఓ మహిళా పోలీసు అధికారి తన ఇంటి నుంచి శిశువు కోసం పాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగుళూరు నుంచి గోరఖ్ పూర్ వెళ్లే రైలు హతియా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంది. ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ తల్లి తన బిడ్డ ఆకలితో ఉందని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చింది. 

అదే సమయంలో విధులు నిర్వహిస్తున్న ASI ఆఫీసర్ సుశీలా బడాయిక్ తన ఇంటికి వెళ్లి పాలు వేడి చేసి బాటిల్ తీసుకువచ్చింది. ఆ పాలను శిశువు తల్లికి ఇచ్చి పాలు పట్టించమని చెప్పింది. శిశువు తల్లి పేరు మెహ్రూనిషాగా గుర్తించారు. తన సొంత ఊరు మధుబనికి వెళ్తోంది. శిశువు ఆకలితో ఏడ్వడంతో తాను పాల తీసుకొచ్చి ఇచ్చినట్టు ఆమె తెలిపింది. మన్ కి బాత్ అప్ డేట్స్ అనే ట్వీట్‌తో రైల్వే మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ప్రసారం చేసింది. తల్లి ప్రేమకు నిదర్శనం అనే ట్యాగుతో వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

Read: పాటలు పాడుతూ పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్న అధికారి..ఎంజాయ్ చేస్తున్న ట్రైనీ పోలీసులు