RR vs GT IPL 2022 : హాఫ్ సెంచరీతో చెలరేగిన పాండ్యా.. రాజ‌స్థాన్ టార్గెట్ 193

RR vs GT IPL 2022 : ఐపీఎల్‌ 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్ 14) రాజ‌స్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది.

RR vs GT IPL 2022 : హాఫ్ సెంచరీతో చెలరేగిన పాండ్యా.. రాజ‌స్థాన్ టార్గెట్ 193

Rr Vs Gt Ipl 2022 Hardik Pandya Fifty Takes Gt To 192 4 (1)

RR vs GT IPL 2022 : ఐపీఎల్‌ 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్ 14) రాజ‌స్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. గుజరాత్ కెప్టెన్ హార్దీక్ పాండ్యా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

దాంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. మొదట్లోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. మాథ్యూ వేడ్ (7), విజ‌య్ శంక‌ర్ (2) ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఇక శుభ్‌మ‌న్ గిల్ (13) చేతులేత్తేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ర్యాంకులో ఉన్న రాజ‌స్థాన్ జట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌ చేశారు.

గుజరాత్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు కీలక వికెట్లను చేజార్చుకుంది. అప్పటినుంచి గుజ‌రాత్ నిల‌క‌డ‌గా ఆడుతూ భారీ స్కోరు దిశగా మ్యాచ్‌ను కొనసాగించింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (87) హాఫ్ సెంచ‌రీ నమోదు చేశాడు. అభిన‌వ్ మ‌నోహ‌ర్ (43) సాధించగా.. పాండ్యా, మనోహార్ జ‌ట్టుకు భారీ స్కోర్ జోడించారు.

ఇంతలోనే అభిన‌వ్ ఔట్ కావడంతో బరిలోకి దిగిన డేవిడ్ మిల్ల‌ర్ (31) దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి గుజ‌రాత్ 192 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌లో హార్దిక్ తన రెండో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 34 బంతుల్లో 91 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు)తో 87 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.

Read Also : IPL 2022 – RR vs GT : టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్.. గుజరాత్‌కు స్టార్ బౌలర్ దూరం..!