RRR – Radhe Shyam : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు ఇప్పట్లో లేనట్టేనా?..

ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అనుకున్న టైమ్‌కి అది చేద్దాం, ఇది చేద్దాం అని తెగ ప్లాన్లు వేసుకున్నా.. అవేవీ వర్కౌట్ కావట్లేదు ఈ రెండు సినిమాలకి. ఆపసోపాలు పడుతూ షూట్ చేసుకుంటున్న ఈ సినిమాల్ని తొందరగా ఫినిష్ చెయ్యడానికి ఎంత పకడ్భందీగా ప్లాన్ వేసినా కుదరట్లేదు. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళిని టెన్షన్ పెట్టిస్తున్న ఆ సినిమాల సంగతేంటో చూద్దాం..

RRR – Radhe Shyam : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు ఇప్పట్లో లేనట్టేనా?..

Rrr Radhe Shyam

RRR – Radhe Shyam: ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అనుకున్న టైమ్‌కి అది చేద్దాం, ఇది చేద్దాం అని తెగ ప్లాన్లు వేసుకున్నా.. అవేవీ వర్కౌట్ కావట్లేదు ఈ రెండు సినిమాలకి. ఆపసోపాలు పడుతూ షూట్ చేసుకుంటున్న ఈ సినిమాల్ని తొందరగా ఫినిష్ చెయ్యడానికి ఎంత పకడ్భందీగా ప్లాన్ వేసినా కుదరట్లేదు. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళిని టెన్షన్ పెట్టిస్తున్న ఆ సినిమాల సంగతేంటో చూద్దాం.

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్, టాప్ డైరెక్టర్ రాజమౌళి తెగ టెన్షన్ పడుతున్నారు. అనుకున్న టైమ్‌కి సినిమాలు కంప్లీట్ చెయ్యలేక, అనౌన్స్ చేసిన టైమ్‌కి సినిమా రిలీజ్ చెయ్యక ఆపసోపాలు పడుతున్నారు ఇద్దరూ. అమేజింగ్ స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసిందని సంవత్సరం నుంచి చెబుతున్నారు రాజమౌళి. 10 పర్సెంట్ కూడా లేని ఈ సినిమాని కంప్లీట్ చెయ్యడానికి జక్కన్న ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఎక్కడో ఓ చోట ఆగిపోతున్నాయి. ఏ ముహూర్తాన సినిమా మొదలుపెట్టారో కానీ ఇప్పుడే కాదు ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచే రకరకాల కారణాలతో సినిమా డిలే అవుతూనే ఉంది.

RRR

2019 స్టార్ట్ అయిన ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసినప్పుడే 2020 జూలై 30న రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశారు రాజమౌళి. పెద్దగా టైమ్ తీసుకోకుండానే రిలీజ్ చేస్తున్నాడే అనుకునే లోపే.. రకరకాల కారణాలతో రిలీజ్ లేట్ అయ్యి 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. కరోనాతో మొత్తానికే మోసం వచ్చి ఆఖరికి సినిమా 2021 అక్టోబర్ 13కు రిలీజ్ చేస్తున్నాం అని గట్టిగానే అనౌన్స్ చేశారు. ఇక ఈ కరోనా వదలకపోవడంతో ఈ సారి కూడా రిలీజ్ కష్టమే అనుకుంటున్నారు టీమ్.

ట్రిపుల్ టెన్షన్‌లో రాజమౌళి ఉంటే.. ‘రాధే శ్యామ్’ రీ షూట్లతో ప్రభాస్ టెన్షన్‌లో ఉన్నారు. అసలే కెరీర్‌లో బ్రేక్ తీసుకోకుండా.. ఎప్పుడూ లేనంతఫాస్ట్ గా సినిమాల్ని తెరకెక్కస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ తో మాత్రం ఇరిటేట్ అవుతున్నారు. ఎప్పుడో మూడేళ్ల నాడు మొదలుపెట్టిన ఈ సినిమా ఇంకా ఏ మూలకూ రాకుండా ఇబ్బంది పెడుతోంది.

Radhe Shyam
‘ఆదిపురుష్’, ‘సలార్’ తో షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్.. మరో వైపు ‘రాధే శ్యామ్’ షూటింగ్‌కి కూడా రెడీ అవుతున్నారు. అంతా అయిపోయింది అనుకున్న ‘రాధే శ్యామ్’ సినిమాకి మళ్లీ ఏవో ప్యాచప్స్ చెయ్యాల్సి రావడంతో మళ్లీ ఈ సినిమాకి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. జులైలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘రాధే శ్యామ్’ ఇంకా రీ షూట్స్, ప్యాచప్స్‌‌తో వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అసలే రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్‌కు ‘రాధే శ్యామ్’ షూటింగ్ కూడా యాడ్ అవ్వడంతో ఇంకా ఎన్నాళ్లు? అని ఇరిటేట్ అవుతున్నట్టు టాక్.