RRR: బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. రీసెంట్‌గా ఈ సినిమాను జపాన్ దేశంలో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

RRR: బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

RRR Breaks Baahubali 2 Record In Japan

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను జక్కన్న తీర్చిదిద్దన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఆర్ఆర్ఆర్ : RRR సీక్వెల్‌కి కథ సిద్ధం చేస్తున్నాము.. రాజమౌళి!

ఫలితంగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన తరువాత ఈ మూవీ గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంది. రీసెంట్‌గా ఈ సినిమాను జపాన్ దేశంలో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అక్కడ ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ జపాన్ కూడా వెళ్లింది. అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అక్కడ ఈ సినిమా కేవలం నాలుగు వారాల్లోనే ఏకంగా 250 మిలియన్ యెన్ వసూళ్లతో దుమ్ములేపింది.

Ram Charan : నాకు సైనస్ ప్రాబ్లమ్, డస్ట్ ఎలర్జీ ఉంది.. కానీ RRRలో నా ఎంట్రీ సీన్ 30 రోజులు డస్ట్ లోనే తీశారు..

గతంలో బాహుబలి-2 ఈ మార్క్‌ను అందుకునేందుకు ఏకంగా 36 వారాల సమయం తీసుకుంది. కానీ, ఆర్ఆర్ఆర్ కేవలం 4 వారాల్లోనే ఈ మార్క్ అందుకుని బాహుబలి-2 రికార్డును లేపేసింది. ఇక ఈ సినిమాకు అక్కడ ఇంకా ఆదరణ పెరుగుతూ వస్తుండటంతో మున్ముందు జపాన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.