RRR : రజినీకాంత్, ప్రభాస్ తర్వాత జపాన్‌లో ఆ రికార్డ్ కొట్టింది RRR సినిమానే..

ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సాధించిన RRR సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు RRR సినిమా జపాన్ లో 185 మిలియన్ యెన్స్ సాధించింది. అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో...............

RRR : రజినీకాంత్, ప్రభాస్ తర్వాత జపాన్‌లో ఆ రికార్డ్ కొట్టింది RRR సినిమానే..

RRR collections in Japan

RRR :  రాజమౌళి దర్శహకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల కలెక్షన్లని సాధించింది ఈ సినిమా. అంతే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ఈ సినిమాని అభినందిస్తున్నారు. దర్శకుడిగా రాజమౌళి ప్రశంశలు అందుకుంటున్నారు. హాలీవుడ్ లో రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం RRR సినిమాని జపాన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ ఫ్యామిలీలతో కలిసి మరీ జపాన్ వెళ్లి సినిమాని అక్కడ కూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. అక్కడి జపాన్ ప్రేక్షకుల అభిమానానికి RRR యూనిట్ ఫిదా అయిపోయింది. జపాన్ లో కూడా RRR సినిమాకి విపరీతమైన స్పందన వచ్చింది.

Jawan : షారుఖ్ జవాన్ కథ నాదే అంటూ.. తమిళ నిర్మాత మండలిలో డైరెక్టర్ అట్లీపై ఫిర్యాదు..

ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సాధించిన RRR సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు RRR సినిమా జపాన్ లో 185 మిలియన్ యెన్స్ సాధించింది. అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 10 కోట్ల 33 లక్షల రూపాయలని కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు జపాన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాలు ఒకటి రజినీకాంత్ ముత్తు, రెండోది ప్రభాస్ బాహుబలి 2. RRR సినిమా ఇదే ఊపు జపాన్ లో కొనసాగిస్తే ఈ రెండు సినిమాల కలెక్షన్స్ కూడా దాటే అవకాశం ఉంది.