RRR Film Update: భారీగా జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్!

సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న RRR ఇప్పటికే ఇండియన్ మార్కెట్ లో బిజినెస్ జరిగిపోయిందని టాక్ నడుస్తుండగా తాజాగా మన సినిమాకి అతిపెద్ద మార్కెట్ అయిన యూఎస్ఏలో కూడా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిందని సమాచారం.

RRR Film Update: భారీగా జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్!

Rrr Film Update Rrr Film Update Huge Pre Release Business

RRR Film Update: బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి సాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ మీదుగా హాలీవుడ్ వరకు నటీనటులను తెచ్చిన ఆర్ఆర్ఆర్ కోసం మెగా-నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్స్ సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దుగా నిలపగా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

ఈ సినిమా అంచనాలను.. క్రేజ్ ను కొలిచేందుకు తెలుగు ఇండస్ట్రీలో కొలమానాలు సరిపోకపోగా.. ఇండియన్ సినీ ప్రముఖులు ఈ సినిమా మీద ఓ కన్నేసి ఉంచారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్ కనుక ప్రీ రిలీజ్ కూడా అదే స్థాయిలో జరిగిపోతుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ మార్కెట్ లో బిజినెస్ జరిగిపోయిందని టాక్ నడుస్తుండగా తాజాగా మన సినిమాకి అతిపెద్ద మార్కెట్ అయిన యూఎస్ఏలో కూడా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిందని సమాచారం.

ఇప్పటికే తమిళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కొనుగోలు చేయగా కర్ణాటకలో ఏషియన్ – వారాహి సంస్థలు సొంతం చేసుకున్నాయని సమాచారం. ఇక ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ తో పాటు అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్-డిజిటల్-శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ సరిగమ సినిమాస్-రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సంయుక్తంగా సొంతం చేసుకోగా ఇందు కోసం భారీ మొత్తంలో చెల్లించనున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. మొత్తంగా సినిమా విడుదలకు దాదాపు ఏడు నెలల ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిపోవడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.