ఇండియన్ సినిమా హిస్టరీలో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్..

ఇండియన్ సినిమా హిస్టరీలో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్..

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఒలీవియా మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, శ్రియ వంటి భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతన్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది.

ఈ సినిమా ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా లేనంతంగా భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. సమాచారం మేరకు ఏరియాల వారీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రా : రూ. 165 కోట్లు
తెలంగాణ : రూ. 75 కోట్లు
కర్ణాటక : రూ. 45 కోట్లు
కేరళ : రూ. 15 కోట్లు
తమిళనాడు : రూ. 50 కోట్లు
ఓవరాల్ సౌత్ : రూ.350 కోట్లు
హిందీ : రూ. 100 కోట్లు
ఓవర్సీస్ : రూ. 70 కోట్లు
మొత్తం : రూ. 520 కోట్లు..