RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి

RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!

RRR

RRR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్‌ను ఆచార్య తట్టుకోగలడా?

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ మధ్యనే యాభై రోజులు పూర్తి చేసుకోగా మే 20 నుండి ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. సినిమా యాభై రోజులు పూర్తిచేసుకున్నా.. త్వరలో ఓటీటీలో రాబోతున్న సినిమాకి ప్రేక్షకుల నుండి ఆదరణకు మాత్రం డోకా లేదు. ఇండియాతో పాటు యూఎస్ లో కూడా ఆర్ఆర్ఆర్ భారీ వసూళ్లను సాధించుకోగా.. ఇప్పుడు యూఎస్ లో ఈ సినిమా రీ రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈసారి ఒరిజినల్ కట్ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు.

RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్

జూన్ 1న యూఎస్ లో ఒరిజినల్ కట్ వెర్షన్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. దీనికి ఇప్పటికే ఊహించని స్థాయిలో బుకింగ్స్ కూడా మొదలు కాగా.. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ రెస్పాన్స్ ను బట్టి మరికొన్ని షోస్ వేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హడావుడి కూడా మొదలు కాగా ఇక ఏ స్థాయి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.