RRR : కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడో తెలుసా..?

‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూసే అవకాశం ఇక ఈ సంవత్సరానికి లేనట్టే.. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేసి తీరతామని రీసెంట్‌గా ఎన్టీఆర్ బర్త్‌డే పోస్టర్ మీద కూడా కన్ఫామ్ చేశారు..

RRR : కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడో తెలుసా..?

Rrr

RRR: ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూసే అవకాశం ఇక ఈ సంవత్సరానికి లేనట్టే. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేసి తీరతామని రీసెంట్‌గా ఎన్టీఆర్ బర్త్‌డే పోస్టర్ మీద కూడా కన్ఫామ్ చేశారు. కానీ అసలు కోవిడ్ టైమ్‌లో రిలీజ్ చేస్తే కలెక్షన్లు కాదు కదా.. కనీసం డబ్బులు కూడా రావనుకుని కొత్త డేట్ ఫిక్స్ చేశారు జక్కన్న అండ్ కో.

‘ట్రిపుల్ ఆర్ సినిమాని చెక్కుతూనే ఉన్న జక్కన్నకు ఈ రిలీజ్ డేట్ కూడా కలిసొచ్చేలా లేదు. ఆల్రెడీ స్టార్లెవరూ షూటింగ్‌కి రావడం లేదు. ఇంకా ఆలియా భట్‌తో పాటు మెయిన్ స్టార్స్‌తో సీన్స్ పెండింగ్ ఉన్నాయి. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసేసింది. దాంతో సినిమా రిలీజ్‌ని ఈ సంవత్సరానికి మిడిల్ డ్రాప్ చేసి ‘ట్రిపుల్ ఆర్’ నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్‌లో మరో కొత్త రిలీజ్ డేట్ వెతుక్కుంటోంది.

ఎన్టీఆర్, చరణ్ లాంటి భారీ స్టార్ కాస్ట్‌తో రాజమౌళి డైరెక్షన్లో ఆపసోపాలు పడుతూ షూట్ చేసుకుంటున్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమాని తొందరగా ఫినిష్ చెయ్యడానికి ఎంత పకడ్భందీగా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ వల్ల స్టార్లెవ్వరూ ఇంకో నెల రోజులు షూటింగ్‌కి వచ్చే పరిస్థితి లేదు. ఈ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్.. ఇలా అన్నీ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 6 నెలలు టైమ్ పడుతుంది. అందుకే ‘ట్రిపుల్ ఆర్’ ని నెక్ట్స్ ఎర్లీ సమ్మర్‌కి పోస్ట్ పోన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

2019లో స్టార్ట్ అయిన ‘ట్రిపుల్ ఆర్’ మొదలు పెట్టినప్పుడే 2020 జూలై 30న రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశారు రాజమౌళి. రకరకాల కారణాలతో రిలీజ్ లేట్ అయ్యి 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. కరోనాతో ఇంకా డిలే అయిన సినిమాని 2021 అక్టోబర్ 13కు రిలీజ్ చేస్తున్నాం అని మళ్లీ మొన్న ఎన్టీఆర్ బర్త్‌డే పోస్టర్‌లో మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటిన్యూ అయితే అక్టోబర్‌కి కాదు కదా.. కనీసం సంక్రాంతికి కూడా సినిమాని రిలీజ్ చెయ్యలేరనుకుంటోంది టాలీవుడ్. అయితే జక్కన్న మాత్రం ఈ కరోనా పరిస్థితులు అప్పటికి క్లియర్ అయ్యి మళ్లీ ఆడియెన్స్ థియేటర్లకి వచ్చే పరిస్థితులు ఉంటాయని నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్‌కి ‘ట్రిపుల్ ఆర్’ ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారని టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.