Indo-Pak border: సరిహద్దులో రూ.135 కోట్ల డ్రగ్స్!

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరోసారి అలజడి రేగింది. అయితే.. ఈసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఒక వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చివేయగా అతడి నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉన్న హీరానగర్‌ సెక్టార్‌లో బుధవారం తెల్లవారుజామున..

Indo-Pak border: సరిహద్దులో రూ.135 కోట్ల డ్రగ్స్!

Indo Pak Border (1)

Indo-Pak border: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరోసారి అలజడి రేగింది. అయితే.. ఈసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఒక వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చివేయగా అతడి నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉన్న హీరానగర్‌ సెక్టార్‌లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ గుర్తించి అతడిని లొంగిపోవాలని కోరారు.

కానీ ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించాడు. కాగా, అనంతరం అతని వద్ద నుండి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో ఉగ్రదాడులు.. భద్రతా దళాల ఎన్ కౌంటర్లు సహజమే కాగా ఇంత భారీస్థాయిలో డ్రగ్స్ కార్యకలాపాలను భద్రతా దళాలు ఛేదించడం ఇప్పుడు కలకలంగా మారింది.

చనిపోయిన వ్యక్తి వివరాలతో పాటు ఈ డ్రగ్స్ ఎక్కడ నుండి లభిస్తున్నాయి.. ఇండియాలో ఎక్కడకి చేరవేస్తున్నారనే అంశంపై దర్యాప్తులు మొదలయ్యాయి. కాగా.. పాకిస్థాన్ నుంచి భారత్​లోకి ఉగ్రవాదులు సులభంగా చొరబడేందుకు ఏర్పాటు చేసిన 150 మీటర్ల భూగర్భ సొరంగంను జనవరి 23న బీఎస్​ఎఫ్​ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు డ్రగ్స్ ముఠాను అడ్డుకున్నారు.