Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం జాక్వెలిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

రూ.2 లక్షల పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చింది. అలాగే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. సుకేష్ చంద్రశేఖరన్ అనే వ్యక్తి రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడు. పలువురిని మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడు. దీంతో ఇలాంటి ఆరోపణలపై ఈడీ, సీబీఐ సుకేష్‌ను అరెస్టు చేసింది. అయితే, సుకేష్‌తో జాక్వెలిన్ గతంలో డేటింగ్ చేసింది. అతడితో సన్నిహితంగా ఉంది. ఈ సమయంలో సుకేష్.. జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు కొన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. దీంతో అతడితో సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ కేసులో జాక్వెలిన్‌ పాత్ర కూడా ఉందని భావించిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

World’s Population: 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్న భారత్

విచారణ తర్వాత అరెస్టు చేశారు. తర్వాత ఆమె మధ్యంతర బెయిల్ తీసుకుని విడుదలైంది. అనంతరం పూర్తి స్థాయి బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ, పాటియాలా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.