VA Shrikumar Menon: సినిమా తీస్తానని రూ.7 కోట్లు వసూలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!

ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్‌ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు.

VA Shrikumar Menon: సినిమా తీస్తానని రూ.7 కోట్లు వసూలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!

Rs 7 Crore Collected For Making Film Leading Director Arrested

VA Shrikumar Menon: ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్‌ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు. ఉత్తర పాలక్కాడ్ జిల్లాలో సదరు డైరెక్టర్ నివాసంలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేయగా.. మీనన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జిల్లాకోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మీనన్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదైనట్టు అలప్పుజ డీఎస్పీ డీకే పృథ్విరాజ్ వెల్లడించారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. కాగా ప్రముఖ నటి మంజు వారియర్‌ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో మీనన్‌ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. మోహన్‌లాల్-మంజువారియర్ నటించిన ఒడియన్ సినిమాతో డైరెక్టర్‌గా మీనన్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.