Kurnool : రెండు బ్యాగుల్లో రూ.90 లక్షలు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు?

కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును తరలిస్తుండగా దొరికిపోయారు.

10TV Telugu News

Kurnool : కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును తరలిస్తుండగా దొరికిపోయారు.

కర్నూలులోకి పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రావెల్స్ బస్సులో రెండు బ్యాగుల్లో రూ.90 లక్షల గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకో సృజన మధుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తాలూకా పోలీసులకు అప్పగించారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

నగదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఈ పనిమీద తీసుకెళ్తున్నారు అనేది విచారణ తర్వాతే తెలుస్తుందని పోలీసులు వివరించారు.

10TV Telugu News