MGNREGA: రూ.929 కోట్ల ఉపాధి హామీ వేతనాల విడుదల

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. విడుదలకు ముందు నిధులు ఎప్పు డు విడుదల చేస్తారా?..

MGNREGA: రూ.929 కోట్ల ఉపాధి హామీ వేతనాల విడుదల

Mgnrega

MGNREGA: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. విడుదలకు ముందు నిధులు ఎప్పు డు విడుదల చేస్తారా?.. ఆ తర్వాత కేటాయింపులలో హెచ్చు తగ్గులు ఇలా ఎప్పుడూ ఇది చర్చనీయాంశమే. తాజాగా రూ.929 కోట్ల ఉపాధి హామీ వేతనాల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీసం 100 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వబడుతున్న సంగతి తెలిసిందే.

iPhone 13 Gift to MLAs : అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికి ఐఫోన్ 13 సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..!

మొత్తం 6 కోట్ల కుటుంబాలకు పైగా ఈ ఉపాధి హామీ లభించనున్న ఈ పథకంలో నమోదైన డేటాలో దాదాపు మొత్తం 99.63 శాతం మందికి ఉపాధి కల్పించబడుతుంది. కాగా, ఈ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న వేతనదారులకు తక్షణ వేతన చెల్లింపుల నిమిత్తం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి విడతలో భాగంగా తొలిసారి ఈ రూ.929.20 కోట్ల మొత్తానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది.

Central Govt : రెచ్చ‌గొట్టే, త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయొద్దు.. టీవీ చాన‌ళ్ల‌పై కేంద్రం సీరియ‌స్

ఈ మొత్తం నిధులు విడతల వారీగా, రోజువారీ వేతన ఎఫ్.టి.ఓల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ కానుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 18 శాతానికి పైగా పెరుగుదల ఉంటుందని గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసింది తొలి విడత నిధులు మాత్రమే కాగా.. మొత్తం నిధుల విడుదలైతే కానీ ఈ ఏడాది ఎంతమేర పెరుగుదల ఉందన్నది తెలుస్తుంది.