YS Sharmila: వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకరం తండా శివారులో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. అంతేగాక, కొన్ని వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ముగ్గురు ఏసీపీలతో పాటు ఆరుగురు సీఐలు కూడా ఉండడం గమనార్హం. షర్మిలతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.  ఆ సమయంలో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగారు. శాంతి భద్రతల విఘాతం దృష్ట్యా ఆమెను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

YS Sharmila: వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

YS Sharmila: వరంగల్ లోని చెన్నారావుపేటలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకరం తండా శివారులో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. అంతేగాక, కొన్ని వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ముగ్గురు ఏసీపీలతో పాటు ఆరుగురు సీఐలు కూడా ఉండడం గమనార్హం. షర్మిలతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.  ఆ సమయంలో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగారు. శాంతి భద్రతల విఘాతం దృష్ట్యా ఆమెను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

దీంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు మండిపడ్డారు. నర్సంపేటలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై షర్మిల మండిపడ్డారు. తాను చేస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆమె అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఆ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు తెగబడితే తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె నిలదీశారు. ఉద్రిక్తత నెలకొనడంతో షర్మిల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. షర్మిలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులను అడ్డుకోవడానికి వైఎస్సార్టీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..