Medical Students: భారతీయ విద్యార్థులకు రష్యా గుడ్‌న్యూస్.. యుక్రెయిన్ మెడికల్ విద్యార్థులు రష్యాలో చదివేందుకు అంగీకారం

యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. అవసరమైతే తమ దేశంలో మెడిసిన్ చదవుకోవచ్చని ప్రకటించింది. మధ్యలో ఆపేసిన చదువును తమ దేశంలో పూర్తి చేయవచ్చని తెలిపింది.

Medical Students: భారతీయ విద్యార్థులకు రష్యా గుడ్‌న్యూస్.. యుక్రెయిన్ మెడికల్ విద్యార్థులు రష్యాలో చదివేందుకు అంగీకారం

Medical Students: రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు యుద్ధం కారణంగా ఉన్నపళంగా ఆ దేశం విడిచి రావాల్సి వచ్చింది.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

దీంతో వాళ్ల చదువు మధ్యలో ఆగిపోయింది. ఈ కారణంగా ఎక్కువగా నష్టపోయింది అక్కడ మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థులే. మెడిసిన్ కోర్స్ మధ్యలో మానేసి వచ్చిన వాళ్లు తిరిగి అక్కడికి వెళ్లలేక… ఇక్కడ ప్రభుత్వం సహకరించక ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇప్పుడు ఇలాంటి విద్యార్థులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. యుక్రెయిన్‌లో చదువు మధ్యలో మానేసి వచ్చిన వాళ్లు కావాలనుకుంటే తమ దేశంలో మెడిసిన్ చదవొచ్చని రష్యా చెప్పింది. పైగా రెండు దేశాల్లో మెడిసిన్ సిలబస్ ఒకేలా ఉంటుందని, అందువల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగదని కూడా హామీ ఇచ్చింది.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

ఈ మేరకు రష్యా రాయబారి ఒలెగ్ అవ్‌దేవ్ మాట్లాడుతూ ఈ విషయంపై హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌లో మెడిసిన్ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రష్యాలో మెడిసిన్ చదవొచ్చు. రెండు దేశాల్లో సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. యుక్రెయిన్‌లో చాలా మంది రష్యన్ భాష మాట్లాడుతారు. అందువల్ల భాష కూడా సమస్య కాదు’’ అని ఒలెగ్ అన్నారు. దీంతో యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రితో భారత విదేశీ వ్యవహారాల మంద్రి జైశంకర్ కలిసిన తర్వాతే రష్యా నుంచి ఈ ప్రతిపాదన రావడం విశేషం.