Russia-Ukraine war.. Indai Benefit : భారత్‌కు కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం .. రష్యా నుంచి చమురు దిగుమతులతో రూ. 35వేల కోట్లు ఆదా

రష్యా - యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఓ విధంగా భారత్‌కు లాభం చేకూరింది. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ దిగుమతులతో ఏకంగా 35వేల కోట్లు మిగిలింది. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా నుంచి ఇండియా భారీగానే క్రూడ్ ని దిగుమతి చేసుకుంటూ వచ్చింది. భారత్ కు 35వేల కోట్ల రూపాయలు ఆదా ఆయ్యేలా చేసింది.

Russia-Ukraine war.. Indai Benefit : భారత్‌కు కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం .. రష్యా నుంచి చమురు దిగుమతులతో రూ. 35వేల కోట్లు ఆదా

Russia-Ukraine war.. Indai Benefit

Russia-Ukraine war.. Indai Benefit : రష్యా – యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఓ విధంగా భారత్‌కు లాభం చేకూరింది. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ దిగుమతులతో ఏకంగా 35వేల కోట్లు మిగిలింది. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా నుంచి ఇండియా భారీగానే క్రూడ్ ని దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అమెరికాతో పాటు, దాని మిత్ర దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా మన దేశం వెనక్కి తగ్గలేదు. అదే ఇప్పుడు 35వేల కోట్ల రూపాయలు ఆదా ఆయ్యేలా చేసింది.

భారత్‌కు చిరకాల స్నేహితుడు రష్యా. నిన్నకాక మొన్న వచ్చిన అమెరికా లాంటి దేశాలు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే మనతో జత కడుతున్నాయి. కానీ రష్యా అలా కాదు. దశాబ్దాల కాలంగా దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ మన కష్టకాలంలో తోడు నిలిచింది. పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలోనూ మన వెన్నంటే నిలిచి మేమున్నాం అంటూ మన భుజం తట్టింది. దశాబ్దాల కాలంలో రెండు దేశాల్లోనూ ఎందరో నాయకులు మారారు. మరెన్నో ప్రభుత్వాలు మారాయి.. కానీ భారత్‌ – రష్యా మధ్య బంధం మాత్రం అలానే కొనసాగుతోంది. అంతే ధృడంగా ఉంది. మనకెలాంటి కష్టం వచ్చినా ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చి అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి నిజమైన స్నేహానికి అర్థం రష్యా. భారత్‌ – రష్యా మధ్య సాంస్కృతిక, చారిత్రక బంధం చాలా బలమైనది. ముఖ్యంగా పాకిస్తాన్‌ విషయంలో, కశ్మీర్‌ విషయంలో మనకు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం రష్యా మాత్రమే ! అందుకే యుద్ధ విషయంలో అంతా రష్యాను వ్యతిరేకించిన భారత్‌ మాత్రం తటస్థ వైఖరే తీసుకుంది. అదే భారత్‌కు కలిసొచ్చేలా చేసింది. ఇటు తక్కువ ధరకు చమురు దిగుమతుల విషయంలోనూ అటు రష్యాలో మన సినిమాలకు క్రేజ్‌ పెరగడంలోనూ అన్నీ కలిసొచ్చాయి.

యుక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యకు దిగింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 140 డాలర్లకు చేరింది. 2014 తర్వాత బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ ఇవేమీ భారత్‌ లెక్క చేయలేదు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మన దేశం రష్యా నుంచి భారీ ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. తమ ఆర్ధిక వ్యవస్థకు ఏది మేలో దాన్ని అనుసరించే వెసులుబాటు, హక్కు తమకు ఉన్నాయని ఈ విషయంలో వ్యతిరేకిస్తున్న దేశాలకు భారత్‌ గట్టిగానే జవాబు చెప్పింది. యుక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి ముందు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు కేవలం ఒక శాతం మాత్రమే..! ప్రస్తుతం ఇది 12 శాతానికి పెరిగింది. 2021 మొత్తం కలిపితే 12 మిలియన్ బ్యారెల్స్‌ చమురును మాత్రమే భారత్‌ దిగుమతి చేసుకుంది. కానీ చౌకగా చమురు విక్రయానికి రష్యా ముందుకొచ్చిన తర్వాత ఆ వాటా ఏకంగా 12 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌- మే నెల మధ్య రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులు ఏకంగా 4.7 రెట్లు పెరిగాయి. అంటే ఏ రేంజ్‌లో దిగుమతులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ మన దేశంలో చమురు ధరలు పెరుగుతూ వస్తుంటాయి. దానికి కారణం మన దేశం దిగుమతులపై ఆధారపడడమే. మన దేశం మొత్తం చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. 2021-22 సంవత్సరంలో మన దేశ దిగుమతులు రెట్టింపు అయి 119 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. రష్యా మన దేశానికి 35 డాలర్లకే బ్యారెల్‌ క్రూడాయిల్‌ను అందిస్తోంది. ఈ లెక్కన భారత్‌ సుమారు రూ.35 వేల కోట్ల మేర లబ్ధి చేకూరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగానే మన దేశం తక్కువ రేటుకు వచ్చే రష్యా చమురును కొనుగోలు చేసింది. ద్రవ్యోల్బణం అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ చమురు ఎంతో కొంత దోహదపడింది. ఆ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే విషయం చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహం వల్ల సబ్సిడీ బిల్లు తగ్గుతోందని అన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ చమురును కొనుగోలు చేయడం లేదు. కంపెనీలు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాయి.

2020లో కోవిడ్‌ మహమ్మారి ప్రవేశం తర్వాత ఆయిల్‌ ధరలు అమాంతం పడిపోయాయి. ఆ సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి దేశంలో వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంది. ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో సుమారు రూ.25వేల కోట్ల మేర ఆదా అయింది. ఇప్పుడు సరైన సమయంలో రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకుని మరో 35 వేల కోట్ల రూపాయలు మిగుల్చుకుంది. చమురు తక్కువ ధరకు వస్తున్నందున ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం పడుతుంది. దీంతో మన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. అదెలా అంటే… చమురు దిగుమతుల బిల్లు తగ్గితే ఆటోమేటిక్‌గా మన విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. డాలర్‌ డిమాండ్‌ తగ్గుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ భారం తగ్గుతుంది. కరోనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా.. రష్యాతో ఉన్న స్నేహం మనకు కలిసొచ్చేలా చేసింది. మన దేశంలోకి రష్యా నుంచి చమురు దిగుమతులు ప్రస్తుతం భారీగానే జరుగుతున్నాయి. అయితే రష్యా నుంచి దిగుమతుల విషయంలో అమెరికా సహా ఇతర దేశాలు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. తాము ఆంక్షలు పెట్టిన దేశం నుంచి మీరెలా చమురు కొనుగోలు చేస్తాయని అగ్రరాజ్యం నిలదీసింది.అయినా భారత్‌ లెక్క చేయలేదు. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని తేల్చిపారేసింది. అలా ఆ సమయంలో సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఏకంగా 35వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేలా చేసింది.

చమురు కొనుగోలు సమయంలో అమెరికా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. భారత్‌ నిర్వహించే లావాదేవీలు.. రష్యాపై తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. క్రెమ్లిన్ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని భారత్‌ మార్చుకోవాని వార్నింగ్‌ ఇచ్చింది. భారత్‌ లావాదేవీల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్‌ బలపడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము సహించబోమని చెప్పింది. చైనా, రష్యా అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో డ్రాగన్ కంట్రీ నిబంధనలు ఉల్లంఘించి దాడికి పాల్పడితే..భారత్‌ను ఆదుకోడానికి రష్యా ముందుకొస్తుందా అంటూ కొత్త మెలికలు పెట్టింది. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఆకాశానికి అంటిన వేళ.. అవసరాలను దృష్టిలోపెట్టుకొని రష్యా డీల్‌కు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇదే ధరకు.. ఇదే స్థాయిలో అమెరికా అందించినా తీసుకునేందుకు తాము సిద్ధమేనని అగ్రరాజ్యానికి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత అమెరికా ఈ విషయంలో సైలెంట్‌ అయిపోయింది. భారత్‌ ఆ టైమ్‌లో తీసుకున్న నిర్ణయం బాగా కలిసొచ్చింది.