Russian Airlines : 18 నుంచి 65 ఏళ్ల పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశం ..

యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని దేశం వదిలిపోతున్నారు రష్యన్లు. దీంతో 18 నుంచి 65 ఏళ్ల పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశించింది.

Russian Airlines : 18 నుంచి 65 ఏళ్ల పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశం ..

Russian Airlines

Russian Airlines : యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు అవుతోంది. ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా రష్యా మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. ఐరోపా దేశాల అండతో యుక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగా బదులిస్తోంది. యుద్ధంలో భాగంగా రష్యా సైనికులను భారీగా కోల్పోయింది. యుక్రెయిన్ పై చేసే యుద్ధంలో తాడోపేడో తేల్చుకునేందుకు రిజర్వ్‌ సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నారు పుతిన్. అంతేకాదు అవసరమైతే తన పంతం నెగ్గించుకునేందుకు అణుయుద్ధానికైనా సిద్ధమేనని హెచ్చరికలు చేస్తున్నారు పుతిన్.

ఈక్రమంలో యుక్రెయిన్‌పై సాగుతోన్న దాడిలో మరింత పట్టు బిగించే క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ బుధవారం (9,2022) కీలక ప్రకటన చేశారు. 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. పుతిన్‌ చేసిన ఈ ప్రకటన రష్యన్ల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏ క్షణాన యుద్ధపు విధుల్లో చేరాలనే ఆదేశాలు వస్తాయేమోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. విమానాశ్రయాలకు క్యూ కడుతున్నారు. గతంలో ఆర్మీలో కొన్నిరోజుల పాటు పనిచేసి ప్రస్తుతం రిజర్వ్‌గా ఉన్న 35ఏళ్ల లోపు పురుషులను ఈ సైనిక సమీకరణకు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది రిజర్విస్ట్‌లకు నోటీసులు కూడా అందాయని సమాచారం. వారిని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సైన్యంలో చేరడానికి భయపడి వీరిలో చాలా మంది దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యన్​ ఎయిర్​లైన్స్ ఆదేశం
దీంతో 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యన్​ ఎయిర్​లైన్స్​ గురువారం ఆదేశాలు జారీ చేసింది. యువకులు దేశం విడిచి వెళ్లాలంటే రష్యా రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి. మార్షల్​ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయని రష్యన్లు భయపడుతున్నారు. ముఖ్యంగా పురుషులు భయపడుతున్నారు. వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉక్రెయిన్​లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటించినప్పటి నుంచి రష్యా – ఐరోపా సమాఖ్య మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు, రష్యా నుంచి వెళ్లే విమానాలు నిండిపోతున్నాయి. రష్యాకు సమీపంలో ఉన్న ఆర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్‌, కజకిస్థాన్‌ దేశాల్లోని నగరాలకు వెళ్లే విమానాల్లోని టికెట్లు బుధవారం (9,2022) క్షణాల్లో అమ్ముడైపోయాయి. రష్యా రాజధాని మాస్కో నుంచి వేరే దేశానికి వెళ్లే దాదాపు అన్ని విమానాల్లో శనివారం వరకు టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి. ఈ క్రమంలోనే టికెట్లు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. విమానాలను ట్రాక్‌ చేసే ఫ్లైట్‌రాడార్‌24 డేటా చూస్తే.. రష్యా నుంచి బయటకు వెళ్లే విమానాల రద్దీ స్పష్టంగా అర్థమవుతోంది.

విమాన టికెట్ల విక్రయాలు బంద్‌..
మరోవైపు, రష్యాలో 18 నుంచి 65 ఏళ్ల మధ్య పురుషులకు విమాన టికెట్లు విక్రయించవద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశించింది.విదేశాలకు వెళ్లేందుకు రష్యా రక్షణశాఖ అనుమతి ఉన్న పురుషులకే ఎయిర్‌లైన్లు టికెట్లు అమ్ముతున్నట్లు సమాచారం.

ఖైదీలను సైన్యంలోకి తీసుకుంటున్న రష్యా..
సైనిక బలాన్ని పెంచుకోవటానికి రష్యా అత్యంత సంచలన నిర్ణయం తీసుకంది. సైనిక సమీకరణలో భాగంగా ఖైదీలను కూడా యుద్ధ విధుల్లోకి తీసుకుంటోందని పక్కాగా తెలుస్తోంది.