Daria Kasatkina : అవును.. నేను లెస్బియన్.. టెన్నిస్ స్టార్ సంచలన ప్రకటన

తాను లెస్బియన్ అని ఆ టెన్నిస్ స్టార్ తెలిపింది. అంతేకాదు తాను లెస్బియన్ అని గర్వంగా చెప్పుకుంటానంది. ఈ సందర్భంగా తన భాగస్వామి, స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.

Daria Kasatkina : అవును.. నేను లెస్బియన్.. టెన్నిస్ స్టార్ సంచలన ప్రకటన
ad

Daria Kasatkina : రష్యా టెన్నిస్ స్టార్ డరియా కసత్కినా(25) సంచలన విషయాన్ని బయటపెట్టింది. తాను లెస్బియన్ అని ఆమె తెలిపింది. అంతేకాదు తాను లెస్బియన్ అని గర్వంగా చెప్పుకుంటానంది. ఈ సందర్భంగా తన భాగస్వామి, స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది డరియా. 1993లోనే స్వలింగ సంప్కరాన్ని నేరంగా పరిగణించింది రష్యా. ఇటీవల దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా నిషేధించింది. దీనిపై కసత్కినా తీవ్రంగా స్పందించింది. రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయని చెప్పింది.

డరియా కసత్కినా ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 12వ స్థానంలో ఉంది. తాను లెస్బియన్ (స్వలింగ సంపర్కురాలు) అంటూ ఈ టెన్నిస్ భామ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హోమో సెక్సువల్స్ పట్ల రష్యాలో అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబట్టింది.

PV Sindhu : సింగపూర్ ఓపెన్ విజేత సింధుపై ట్రోల్స్.. స్పందించిన కోచ్

ఇటీవల రష్యా ప్రభుత్వం అన్ని రకాల సంప్రదాయ విరుద్ధ శృంగార సంబంధాలను బహిర్గతం చేయడాన్ని నిషేధించేలా కొత్త చట్టానికి ప్రతిపాదనలు చేసింది. రష్యాలో స్వలింగ సంపర్క సంబంధిత అంశాలను ప్రసారం చేయడంపై 2013 నుంచే నిషేధం ఉంది. అంతేకాదు, 1993 నుంచి రష్యాలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, టెన్నిస్ తార దరియా కసాట్కినా ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను లెస్బియన్ ను అంటూ ధైర్యంగా అంగీకరించింది. నిషేధించాల్సిన అంశాలు దీనికంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని, అయినా ప్రభుత్వ నిర్ణయంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదంది. సహజీవనం చేస్తున్న ఇద్దరమ్మాయిలు తమ బంధాన్ని గోప్యంగా ఉంచాలని వారు పేర్కొనడం అర్థరహితం అని కసాట్కినా అభిప్రాయపడింది. ప్రశాంతత దిశగా మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడం ఒక్కటే ముఖ్యమని తేల్చి చెప్పింది.

MS Dhoni: ఇంగ్లండ్‌లో ధోనీ వాకింగ్.. ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్.. వీడియో వైరల్

ఇటీవలే తన స్వలింగ సంపర్కం గురించి నిర్భయంగా వెల్లడించిన రష్యా ఫుట్ బాల్ క్రీడాకారిణి నదియా కార్పొవాను కసాట్కినా అభినందించింది. కార్పోవా తన సెక్సువాలిటీని చాటేందుకు ముందుకు రావడం హర్షణీయం అని పేర్కొంది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ లో సెమీఫైనల్ వరకు వెళ్లింది డరియా.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw