రష్యా వ్యాక్సిన్ చివరిదశ ప్రయోగ ఫలితాలు వచ్చేశాయ్..”స్పుత్నిక్ వీ”91.6శాతం ప్రభావవంతమైనది

రష్యా వ్యాక్సిన్  చివరిదశ ప్రయోగ ఫలితాలు వచ్చేశాయ్..”స్పుత్నిక్ వీ”91.6శాతం ప్రభావవంతమైనది

Sputnik V vaccine కరోనా కట్టడి కోసం రష్యా “స్పుత్నిక్ వీ” వ్యాక్సిన్ ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ ట్రయిల్స్ చివరిదశ ముగియకుండానే మస్కోలోని గమలేయా యూనివర్శిటీ డెవలప్ చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్పిన్ ను గతేడాది ఆగస్టులోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది పుతిన్ ప్రభుత్వం. దీంతో వ్యాక్సిన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే తాజాగా మూడో దశ ప్రయోగాలు బయటికొచ్చాయి. దీంతో పుతిన్ సర్కార్ నిర్ణయాన్ని సైంటిస్టులు సమర్థిస్తున్నారు.

స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగ వివరాలు ది లాన్సెంట్ ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ మంగళవారం బయటపెట్టింది. కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో ఈ వ్యాక్సిన్ 91.6శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ(చివరి దశ) ట్రయిల్స్ లో తేలినట్లు తెలిపింది. ప్లేసీబొ(వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు క్లినికల్ ట్రయిల్స్ లో వాడేది)అందుకున్న 19,966 వాలంటీర్లలోని నాలుగోవంతు మంది డేటా ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేసినట్లు గమలేయా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెప్పారని లాన్సెంట్ పేర్కొంది.

మాస్కోలో స్పుత్నిక్ వీ ట్రయిల్స్ ప్రారంభమైనప్పటి నుంచి..వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 16 సింప్టమాటిక్ కోవిడ్-19(కరోనా రోగ లక్షణాలు ఉన్న)కేసులు నమోదయ్యాయని..ప్లేసిబో గ్రూప్ లో 62 మందికి వైరస్ సోకిందని సైంటిస్టులు తెలిపారు. వ్యాక్సిన్ యొక్క రెండు-డోస్ ల నియమావళి( 21 రోజుల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్ ఇస్తారు) COVID-19పై 91.6% ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇది చూపించిందని వారు తెలిపారు.