Sachin Tendulkar: కపిల్ దేవ్ వందో టెస్టు.. సచిన్ టెండూల్కర్ మొదటి టెస్టు అని మీకు తెలుసా..

పాకిస్తాన్‌లోని కరాచీలో 1989లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లకు చాలా ప్రత్యేకం. ఎలా అంటే 16ఏళ్ల వయస్సున్న సచిన్..

Sachin Tendulkar: కపిల్ దేవ్ వందో టెస్టు.. సచిన్ టెండూల్కర్ మొదటి టెస్టు అని మీకు తెలుసా..

Sachin Tendulkar

Sachin Tendulkar: పాకిస్తాన్‌లోని కరాచీలో 1989లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లకు చాలా ప్రత్యేకం. ఎలా అంటే 16ఏళ్ల వయస్సున్న సచిన్ టెండూల్కర్ కు అది అరంగ్రేట్ మ్యాచ్..

మరో వైపు 30ఏళ్ల కపిల్ దేవ్ టెస్టు కెరీర్ లో వందో మ్యాచ్. దిగ్గజంతో కలిసి ఆడిన సచిన్ తాను భవిష్యత్ దిగ్గజంగా మారతాడని ఊహించి ఉండడు.

కాకపోతే ఆ మ్యాచ్ లో సచిన్ 41/4 పరుగుల వద్ద బ్యాటింగ్ కు దిగి 15పరుగులు మాత్రమే చేయగలిగాడు. కపిల్ దేవ్ 50చేసేశాడు. మ్యాచ్ డ్రాగా ముగియగా.. కపిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నారట.

Read Also: తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడని సచిన్

సచిన్ కెరీర్ లో 200 టెస్టులు చేరగా వరల్డ్ రికార్డ నమోదు చేశాడు మాస్టర్ బ్లాస్టర్. అదే మ్యాచ్ లో సచిన్ తో పాటు ఆడిన సలీల్ అంకోలా మరెప్పుడూ టెస్టు క్రికెట్ లో కన్పించలేదు. అదే మ్యాచ్ తో అరంగ్రేటం చేసిన పాకిస్తానీ ప్లేయర్ షహీద్ సయ్యద్ కూడా ఒక్క టెస్టుతోనే సరిపెట్టేసుకున్నాడు.