Date Night : సారా టెండూల్కర్ డేట్ నైట్..ఆ చేయి ఎవరిదో ?

డేట్ కు వెళ్లిన వ్యక్తి ఎవరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అనుమానాలకు సింగర్ కనికా కపూర్ చెక్ పెట్టారు.

Date Night : సారా టెండూల్కర్ డేట్ నైట్..ఆ చేయి ఎవరిదో ?

Sachin Tendulkar’s Daughter : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే..ఈమె…తనకు సంబంధించిన విషయాలు..ఇతరత్రా..ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. తాజాగా..ఈమెకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. డేట్ నైట్ అంటూ ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. అందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా ? ఆ ఫొటోలో ఎవరిదో చేయి పట్టుకుని నిలబడ్డారు సారా. ఆమె ఎవరి చేయి పట్టుకున్నారంటూ..నెటిజన్లు వెతకడం ప్రారంభించారు.

Read More : India’s Vaccination : భారత్ మరో ఘనత..50శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి

డేట్ కు వెళ్లిన వ్యక్తి ఎవరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అనుమానాలకు సింగర్ కనికా కపూర్ చెక్ పెట్టారు. సారాతో డేట్ కు వెళ్లివచ్చినట్లు చెప్పడంతో అసలు విషయం తెలిసింది. సారా…సింగర్ కనికా కపూర్ లు ఇద్దరూ స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇక సారా విషయానికి వస్తే…టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు తెగ ప్రచారం జరిగింది. గిల్ పోస్టులకు సారా స్పందించడం..వీరిద్దరూ సరదాగా సంభాషించడంతో కొంతమంది ఏవోవో ఊహించుకున్నారు. ఈ విషయంలో వీరిద్దరూ పెదవి విప్పలేదు. ఇటీవలే…దేవతలతో ప్రేమలో పడకూడదు..అనే కొటేషన్ రాసి ఉన్న షర్టు ధరించి ఫొటో షేర్ చేశారు గిల్. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరిగిందని, బ్రేకప్ అయ్యిందంటూ…పుకార్లు షికారు చేశాయి.

Read More : Raviteja : రామారావు ఆన్ డ్యూటీ.. రేపే ఆర్డర్స్..

ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో గిల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆఖరి టెస్టు మ్యాచ్ లో గిల్ 47 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఇటీవలే ఫామ్ లో లేకపోవడంతో..పలువురు అతనికి సలహాలు, సూచనలు చేశారు. ఇతడిలో చాలా ప్రతిభ దాగి ఉందని, పిచ్ ఆఫ్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు..ఈ బంతులను ఎదుర్కొంటే…చాలని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు. శుభ్ మన్ గిల్ తన టెక్నిక్ పై ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.