Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్

ఇండియా - ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న ప్రస్తుత టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. శుక్రవారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెంచరీ బాదిన మూడో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అంతకంటే ముందు సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ 1996, 2018లలో సెంచరీలు నమోదు చేశారు.

Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్

Pant

Rishabh Pant: ఇండియా – ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న ప్రస్తుత టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. శుక్రవారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెంచరీ బాదిన మూడో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అంతకంటే ముందు సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ 1996, 2018లలో సెంచరీలు నమోదు చేశారు.

ఐదో టెస్టు అయిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం బెన్ స్టోక్స్ ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలేలా చేశారు. ఎట్టకేలకు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు నిలబడి స్కోరు తీరును మార్చారు.

మ్యాటీ పాట్స్ రంగంలోకి దిగి విరాట్ వికెట్ పడగొట్టడంతో టీమిండియా గందరగోళంలో పడింది. పంత్.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. 89 బంతుల్లో 100 పరుగులు నమోదు చేసి జో రూట్ అవుట్ చేసే సమయానికి 146 పరుగులతో నిలిచాడు.

Read Also: సచిన్‌లా పంత్‌ను కూడా ఓపెనర్ చేస్తే..

2018లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 220 బంతుల్లో 22 ఫోర్లు, గరిష్టంగా 149 పరుగులు చేశాడు. కానీ ఆదిల్ రషీద్ వేసిన షార్ట్ అండ్ వైడ్ బాల్‌కు బలి అయ్యాడు. ఇన్నింగ్స్‌లో భారతదేశం నుండి తదుపరి అత్యుత్తమ స్కోరర్ శిఖర్ ధావన్ 26 పరుగులు చేశాడు.