Sachin’s tweet: రెఫెల్ నాదల్‌పై సచిన్ ఆసక్తికర ట్వీట్.. పొగడ్తలతో అభిమానుల రీట్వీట్లు

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రెఫెల్ నాధల్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రిలు ప్రశంసల జల్లు కురిపించారు. ట్వీటర్ వేదికగా రాఫెల్ గ్రేట్ అంటూ పొడిగారు. వీరి ట్వీట్లకు రీ ట్వీట్లు చేసేందుకు నెటిజన్లు పోటీ పడ్డారు. సచిన్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాఫెల్ నాధల్ ను ప్రశంసిస్తూ రీట్వీట్లు చేశారు.

Sachin’s tweet: రెఫెల్ నాదల్‌పై సచిన్ ఆసక్తికర ట్వీట్.. పొగడ్తలతో అభిమానుల రీట్వీట్లు

Tendulkar

Sachin’s tweet: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రెఫెల్ నాధల్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రిలు ప్రశంసల జల్లు కురిపించారు. ట్వీటర్ వేదికగా రాఫెల్ గ్రేట్ అంటూ పొడిగారు. వీరి ట్వీట్లకు రీ ట్వీట్లు చేసేందుకు నెటిజన్లు పోటీ పడ్డారు. సచిన్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాఫెల్ నాధల్ ను ప్రశంసిస్తూ రీట్వీట్లు చేశారు. రాఫెల్ నాధల్ ను పొగుడుతూ సచిన్, రవిశాస్త్రిలు రీ ట్వీట్లు చేయడం వెనుక ఓ కారణం ఉంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ టెన్నీస్ పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటారు. దీంతో నాధల్ ను పొగుడుతూ టీమిండియా మాజీ క్రికెటర్లు ట్వీట్లు చేశారు.

శుక్రవారం పారిస్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్ టెన్సీస్ టోర్నీలో భాగంగా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్, మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. రాఫెల్ నాదల్ విజయం సాధించింది ఫైనల్ లోకి అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో నాదల్‌ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్‌లోని 12వ గేమ్‌ చివర్లో నాదల్‌ రిటర్న్‌ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్‌ కోర్టులో జారి పడ్డాడు. దీంతో జ్వారెవ్ కు తీవ్ర గాయం అయింది. అతను మళ్లీ బరిలోకి దిగే ప్రయత్నం చేసినప్పటికీ నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్ నుంచి వైదొలాడు. దీంతో నాదల్ ను విజేతగా ప్రకటించారు. అయితే 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్‌ రెండు సెట్‌లలో నాదల్‌కు చెమటలు పట్టించాడు. జ్వెరెన్ కాలిగాయంతో కోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు సైతం ఇబ్బంది పడ్డాడు. నొప్పితో బాధపడుతున్న అలెగ్జాండర్ జ్వెరెవ్ వద్దకు వెళ్లిన నాదల్ అతన్ని కౌగిలించుకోవటం కనిపించింది. అంతేకాక జ్వెరెవ్ ను దగ్గరుండి మరీ కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో నాదల్ క్రీడా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

మ్యాచ్ లో గాయంతో ఇబ్బందిపడుతున్న జ్వెరెవ్ తో రెఫెల్ నాదల్ ప్రవర్తించిన తీరును కొనియాడుతూ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా మరో మాజీ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిసైతం నాదల్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు. నాదల్ క్రీడా స్ఫూర్తిని చాటాడంటూ వారు కొనియాడారు. సచిన్, శాస్త్రి చేసిన ట్వీట్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. నాదల్-జ్వెరెవ్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీ-ఫైనల్‌పై సచిన్ చేసిన పోస్ట్‌కు శనివారం ఉదయం నాటికి దాదాపు 1500 రీట్వీట్లు వచ్చాయి. నాదల్ క్రీడా స్ఫూర్తిని ప్రతీఒక్కరూ ప్రశంసిస్తున్నారు.