Sadaa : బలవంతంగా బంధాల్లో ఇరుక్కోవడం కంటే ఒంటరిగా ఉండటం మంచిది.. సదా వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోదా??

తాజాగా సదా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం అడవులకి వెకేషన్ కి వెళ్లిన సదా అక్కడ తీసిన ఓ వీడియోని షేర్ చేసి భారీగానే మ్యాటర్ పెట్టింది. ఈ వీడియో షేర్ చేసి.............

Sadaa : బలవంతంగా బంధాల్లో ఇరుక్కోవడం కంటే ఒంటరిగా ఉండటం మంచిది.. సదా వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోదా??

Sadaa emotional comments on relationships in life

Sadaa :  తెలుగులో జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సదా తెలుగు, తమిళ్, కన్నడలో చాలా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన సదా ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. అప్పుడప్పుడు టీవీ షోలలో మెరిపిస్తుంది. 38 ఏళ్ళు వచ్చినా ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి అడిగితే మాత్రం చూద్దాం అంటుంది.

తాజాగా సదా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం అడవులకి వెకేషన్ కి వెళ్లిన సదా అక్కడ తీసిన ఓ వీడియోని షేర్ చేసి భారీగానే మ్యాటర్ పెట్టింది. ఈ వీడియో షేర్ చేసి.. ”అవసరాల కోసం ఉన్న బంధాల్లో చిక్కుకుపోయి, ఆ మనుషులు వెళ్ళిపోతారేమో అని ఎందుకు భయపడుతున్నారు. మనం సన్నిహితులు అనుకునే వాళ్ళు మనల్ని అనుకోకపోతే వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. మీ జీవితంలో మీకు మీరు మాత్రమే తోడుగా ఉంటారు. లైఫ్ లోకి ఎంతోమంది వస్తారు, వెళ్తారు.”

”అలాంటి వ్యక్తుల గురించి మీ లైఫ్ ని ఇబ్బంది పెట్టకండి. మీకు నచ్చని వారితో మీరు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాల్సినవసరం లేదు. మీతో నిలబడలేని వాళ్ళ గురించి మీరు బాధపడటం మీకే మంచిది కాదు. ఒక్కోసారి అలాంటి వ్యక్తులని మన లైఫ్ నుంచి తప్పిస్తేనే మంచిది. తప్పుడు మనుషుల కోసం జీవితం వృధా చేసుకోకండి. బలవంతపు బంధాలలో ఇరుక్కోవడం కంటే ఒంటరిగా ఉండటం మేలు” అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

Urfi Javed : అలాంటి బట్టలు వేసుకుంటే చంపేస్తాం.. ఉర్ఫీకి బెదిరింపులు.. ఫైర్ అయిన ఉర్ఫీ జావేద్..

దీంతో సదా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సదా పోస్ట్ చూసి ఆమెని అంతగా బాధపెట్టింది ఎవరు? సదా లైఫ్ లోనుంచి వెళ్లిపోయిన ఆ ఆవ్యక్తి ఎవరు? సదా ఇంక ఒంటరిగానే ఉంటుందా? పెళ్లి చేసుకోదా? ఎవరిని ఉద్దేశించి ఏ ఈపోస్ట్ పెట్టింది? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.