Sai Pallavi: సాయి పల్లవి ‘గార్గి’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఎందులో అంటే?

గతకొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే, ఠక్కున అందాల భామ సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఆమె నటించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో....

Sai Pallavi: సాయి పల్లవి ‘గార్గి’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఎందులో అంటే?

Sai Pallavi Gargi Movie Locks Ott Partner

Sai Pallavi: గతకొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే, ఠక్కున అందాల భామ సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఆమె నటించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె క్రేజ్ చూసి బడా స్టార్స్ సైతం అవాక్కయ్యారు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో, ఆమె వాటిపై వివరణ కూడా ఇచ్చింది. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమ్మడు చూసింది.

Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!

అయితే ఇప్పుడు ఈమె నటించిన మరో సినిమా ‘గార్గి’ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్యన రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించగా, తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాగా, తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Sai Pallavi : ‘గార్గి’ సినిమా ప్రెస్ మీట్‌లో చీరలో సాయిపల్లవి క్యూట్ ఫోటోషూట్

కాగా, తాజాగా ఈ సినిమా తన ఓటీటీ పార్ట్ నర్ ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీ లివ్ ఈ సినమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అతి త్వరలోనే ఈ సినిమాను సోనీ లివ్ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నత్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులనుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నట్లు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరి గార్గి చిత్రానికి ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో తెలియాలంటూ ఈ సినిమా టోటల్ రన్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.