సాయి తేజ్ ఫస్ట్‌డే కుమ్మేశాడుగా!

10TV Telugu News

Solo Bratuke So Better: సుప్రీం హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమయ్యాడు.

క్రిస్మస్ కానుకగా ఈనెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇదే కావడం విశేషం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఈ సినిమాతోనే పున:ప్రారంభమవతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కాలంగా మూతపడ్డ థియేటర్లకు జనం మళ్లీ వస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ శుక్రవారం విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ టాలీవుడ్‌కి కాస్త ఊరటని, మరింత భరోసాని ఇచ్చింది. తేజ్ సినిమా ఫస్ట్‌డే మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో కావడం విశేషం.

ఏరియాల వారీగా కలెక్షన్ల వివరాలు..

నైజాం – 1.84 కోట్లు

వైజాగ్ – 0.57 కోట్లు

నెల్లూరు – 0.20 కోట్లు

కృష్ణా – 0.21 కోట్లు

ఈస్ట్ – 0.25 కోట్లు

వెస్ట్ – 0.34 కోట్లు

గుంటూరు – 0.43 కోట్లు

సీడెడ్ – 0.86 కోట్లు

టోటల్ – 4.70 కోట్లు.

×