‘సలార్’ టీం కి ప్రమాదం.. పలువురికి గాయాలు..

‘సలార్’ టీం కి ప్రమాదం.. పలువురికి గాయాలు..

Salaar Team: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. డార్లింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ మంగళవారం (ఫిబ్రవరి 2) ప్రారంభమైంది. అదే రోజు ఈ సినిమా కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం సంభంవించిది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరుగలేదు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘సలార్’ షూటింగ్ ఈ మధ్యే రామగుండంలో స్టార్ట్ అయ్యింది. మంగళవారం రాత్రి ‘సలార్’ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. గోదావరిఖనిలోని శ్రీనగర్ వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.

https://10tv.in/a-major-fire-broke-out-on-the-sets-of-adipurush/

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలు ‘ఆదిపురుష్’, ‘సలార్’ కి సంబంధించి ఒకే రోజు రెండు దుర్ఘటనలు జరగడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రెబల్ స్టార్ త్వరలో ‘ఆదిపురుష్’ షూటింగులో పాల్గొనబోతున్నారు.

Adipurush