Salaar: ఆదిపురుష్ దెబ్బ ‘సలార్’కు కూడా తగలనుందా..?

ఆదిపురుష్ సినిమాను 2023 జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశలకు లోనయ్యారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ వాయిదా ‘సలార్’పై ప్రభావం చూపిస్తుందా అంటే.. అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Salaar: ఆదిపురుష్ దెబ్బ ‘సలార్’కు కూడా తగలనుందా..?

Salaar To Be Effected By Adipurush Postpone

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాను అత్యంత భారీ అంచనాల మధ్య జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా టీజర్‌కు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ కారణంగా, ఈ సినిమాలోని కొన్ని అంశాలను మార్చేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆదిపురుష్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Salaar: సాలార్ మూవీలో ప్రభాస్ లుక్స్ సూపర్..

ఆదిపురుష్ సినిమాను 2023 జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశలకు లోనయ్యారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ వాయిదా ‘సలార్’పై ప్రభావం చూపిస్తుందా అంటే.. అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న ‘సలార్’లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ లాక్ చేసింది. 2023 సెప్టెంబర్ 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Salaar: అఖండను ఫాలో అవుతున్న సలార్.. ఊచకోత గ్యారెంటీ..?

కానీ, ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుండటంతో కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సలార్ సినిమా రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు సరికొత్త సందేహాలను క్రియేట్ చేస్తోంది. అసలే సలార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. అలాంటి ఈ సినిమాను ఎలాంటి సమయంలో రిలీజ్ చేయాలి అనే విషయంపై వారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మరి ఆదిపురుష్ వాయిదా, ఇప్పుడు సలార్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉండటంతో ఈ సినిమా కూడా వాయిదా పడటం ఖాయమని చిత్ర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.