Radhe : రొటీన్ రొట్టకొట్టుడు ‘రాధే’.. సారీ చెప్పిన సల్మాన్..

హిట్ కాంబినేషన్.. పైగా ఈద్ సెంటిమెంట్.. మొత్తానికి రిలీజైంది సల్మాన్ ఖాన్ ‘రాధే’.. ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో చూస్తున్నారు. అయితే ఉన్నట్టుండి సల్మాన్ ఖాన్ ‘సారీ’ అంటూ ముందుకొచ్చాడు..

Radhe : రొటీన్ రొట్టకొట్టుడు ‘రాధే’.. సారీ చెప్పిన సల్మాన్..

Salman Khan Radhe Movie Gets Negative Talk

Radhe: హిట్ కాంబినేషన్.. పైగా ఈద్ సెంటిమెంట్.. మొత్తానికి రిలీజైంది సల్మాన్ ఖాన్ ‘రాధే’.. ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో చూస్తున్నారు. అయితే ఉన్నట్టుండి సల్మాన్ ఖాన్ ‘సారీ’ అంటూ ముందుకొచ్చారు. ఎందుకు? ‘రాధే’ ఆడియెన్స్‌ను డిస్సప్పాయింట్ చేసిందా..?

Radhe : సల్లూ భాయ్ ‘సీటీ మార్’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీశాడు.. ‘రాధే’ ఈద్ ముబారక్ చెబుతున్నాడు..

బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజ్.. పే పర్ వ్యూ పద్ధతిలో 249 రూపాయల టికెట్ రేట్. ఫ్యాన్స్‌కి చేసిన ప్రామిస్ ప్రకారం సల్మాన్ వచ్చేశారు. ఈద్ సందర్భంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ‘రాధే’ రిలీజైంది. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ తర్వాత ప్రభుదేవా, సల్మాన్ కాంబోలో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీగానే అంచనాలు పెరిగాయి. అయితే ‘రాధే’ ను బిగ్ స్క్రీన్‌పై చూడలేకపోతున్న అభిమానులకు.. తన సినిమాతో ప్రాఫిట్ అందుకోలేకపోయిన ఎగ్జిబిటర్స్‌కు సారీ చెప్పారు సల్మాన్ ఖాన్.

Allu Arjun – Salman Khan : బన్నీ స్టెప్స్ కాపీ కొట్టిన భాయ్ జాన్.. కాపీ కాదు క్రెడిట్ ఇచ్చారు..

ఫ్యాన్స్‌కి నచ్చితే కోవిడ్ తగ్గాక థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామన్నారు ‘రాధే’ మేకర్స్. కానీ, అంత బీభత్సంగా ‘రాధే’ నచ్చే ఛాన్స్ లేదంటున్నారు విమర్శకులు. ఈ సినిమాకి ఓటీటీనే కరెక్ట్ అని రివ్యూలు రాస్తున్నారు. ప్రభుదేవా డైరెక్షన్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదని ఇన్ సైడ్ టాక్. అయితే సల్లూభాయ్ ఫ్యాన్స్ ఇవేమి పట్టించుకోరు. ఈద్‌కి సల్లూ సినిమా వచ్చిందా.. ఎంజాయ్ చేశామా.. అనే అనుకుంటారు. సో ఎలాగూ థియేటర్ లెక్కలు లేవు కాబట్టి.. ‘రాధే’ హిట్టా.. ఫ్లాపా.. అన్నది పక్కన పెడితే, ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసి మా హీరో.. సూపర్ హీరో అనిపించుకుంటున్నారు అంటున్నారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్..

Seeti Maar : వావ్.. సల్మాన్ ‘సీటీ మార్’.. బన్నీ, డీఎస్పీలకు థ్యాంక్స్ చెప్పిన భాయ్ జాన్.. ప్రేయసితో పాడించాడుగా!