Salman Khan Radhe: రాధే బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే తన తాజా సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ లాంటి స్టార్ హీరో, నేషనల్ లెవల్ లో భారీ మార్కెట్ ఉన్న హీరో ఇలా భారీ బడ్జెట్ సినిమాను పే ఫర్ వ్యూలో రిలీజ్ చేయడం సంచలనం అనుకోవాలి.

Salman Khan Radhe: రాధే బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్!

Salman Khan Radhe

Salman Khan Radhe: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే తన తాజా సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ లాంటి స్టార్ హీరో, నేషనల్ లెవల్ లో భారీ మార్కెట్ ఉన్న హీరో ఇలా భారీ బడ్జెట్ సినిమాను పే ఫర్ వ్యూలో రిలీజ్ చేయడం సంచలనం అనుకోవాలి. ముంబై క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నిన్ననే జీ ప్లెక్స్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది.

దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రావడంతోనే భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి సల్లు భాయ్ క్రేజ్ ను మరోసారి చూపించింది. కానీ, ఇప్పుడు బాయ్ కాట్ సెగ ఈ సినిమాకు తగిలేలా కనిపిస్తుంది. ఉత్తరాది సినీ పరిశ్రమలో కొంతమంది స్టార్ హీరోల సినిమాలను బాయ్ కాట్ చేయాలని చాలాకాలంగా ఒక యుద్ధమే నడుస్తుంది. బాలీవుడ్ లో నేపాటిజం మీద కొంతమంది ఈ ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ ప్రచారం సెగ భారీగానే తగిలింది.

అలా ఎప్పటిలానే పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలే సెగే ఈ చిత్రానికి కూడా తగిలింది. సోషల్ మీడియాలో సల్మాన్ రాధే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని కొందరు నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. సహజంగా ఇన్నాళ్లు కరోనా రాకముందు థియేటర్స్ లో రిలీజ్ లో ఈ నెగటివ్ ప్రచారం పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారేది. కానీ ఇప్పుడు ఇలా డిజిటల్ లో విడుదల చేసినా ఈ సెగ తప్పడం లేదు. సోషల్ మీడియాలో “బాయ్ కాట్ రాధే” ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది.