సామ్ జామ్ మెగా ప్రోమో చూశారా!

సామ్ జామ్ మెగా ప్రోమో చూశారా!

Sam Jam: డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫస్ట్ అండ్ పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’, సమంతతో ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ తనదైన స్టైల్లో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘ఆహా’ తమ ప్రేక్షకులకోసం పర్ఫెక్ట్ క్రిస్మస్ ట్రీట్ రెడీ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి పార్టిసిపేట్ చేసిన మెగా ఎపిసోడ్‌ను క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా ఈ షోకు సంబంధించి మెగా ప్రోమో రిలీజ్ చేశారు. చిరు తన స్టైల్ మేనరిజమ్స్ అండ్ పంచెస్‌తో ఆకట్టుకున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.