Samantha – Raai Laxmi : వావ్!.. ఆసనాలతో అదరగొడుతున్న సమంత – రాయ్ లక్ష్మీ..

హీరోయిన్లు కేవలం గ్లామర్ ఒలకబోసే ఫొటోషూట్లతోనే కాదు.. గంటల తరబడి కసరత్తులు చేస్తూ, ఆ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటున్నారు. రీసెంట్‌గా సమంత అక్కినేని, ‘రత్తాలు’ రాయ్ లక్ష్మీ ఇద్దరు తమ వర్కౌట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..

Samantha – Raai Laxmi : వావ్!.. ఆసనాలతో అదరగొడుతున్న సమంత – రాయ్ లక్ష్మీ..

Samantha – Raai Laxmi

Samantha – Raai Laxmi: హీరోయిన్లు కేవలం గ్లామర్ ఒలకబోసే ఫొటోషూట్లతోనే కాదు.. గంటల తరబడి కసరత్తులు చేస్తూ, ఆ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటున్నారు. రీసెంట్‌గా సమంత అక్కినేని, ‘రత్తాలు’ రాయ్ లక్ష్మీ ఇద్దరు తమ వర్కౌట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

యోగాలో భాగంగా సమంత తల కిందకి, కాళ్లు పైకి పెట్టి ఆసనం వేస్తూ ఆ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చెయ్యగా ఇప్పటికే 14 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సమంత ఫిట్ నెస్ ఫ్రీక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే మూవీ చేస్తుంది సామ్. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

‘రత్తాలు’గా కుర్రకారుని కవ్వించిన రాయ్ లక్ష్మీ కూడా సమంతలానే ఆసనం వేసి ఆకట్టుకుంది. గ్లామర్‌తోపాటు ఫిట్‌నెస్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే రాయ్ లక్ష్మీ, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా, ఐటెం సాంగ్స్‌తో మెప్పిస్తుందంటే అందుకు ఫికిజ్ కూడా ఓ కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోండని చెప్తున్నట్లు ఈ ముద్దుగుమ్మలు ఇన్‌స్టా‌గ్రామ్‌లో హీట్ పెంచుతున్నారు..

 

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)