Samantha Akkineni: గోవాలో ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సామ్

సమంత అక్కినేని గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ జంట తన పని తాను చేసుకుంటూ పోతుంది.

Samantha Akkineni: గోవాలో ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సామ్

Samantha Akkineni

Samantha Akkineni: సమంత అక్కినేని గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ జంట తన పని తాను చేసుకుంటూ పోతుంది. సమంత అయితే ఆ మధ్య త్వరలోనే తన భర్తకు నాకు ఎంతగానో నచ్చిన గోవాలో ఫార్మ్ హౌస్ రెడీ అవుతుంది అంటూ విడాకుల పుకార్లపై సమాధానం చెప్పకనే చెప్పేసింది. కాగా, ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి సామ్ గోవాకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.

గుణశేఖర్ శాకుంతలం చిత్రీకరణ ముగించిన సామ్ కొంత విరామం తీసుకుని ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ వారి షికార్లకు సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తోంది సమంత. రీసెంట్‌గా సైక్లింగ్ కి సంబంధించిన ఫొటోలు షేర్ చేయ‌గా.. ఇప్పుడు క‌యాకింగ్ చేస్తుంది. నదిలో ఆమె తెడ్డు వేసి బోట్ న‌డుపుతూ సంతోషంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు కేవలం అభిమానులే కాదు, వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె ఆశ్రిత, రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ కూడా స్పందించడం విశేషం.

గోవా అంటూ స‌మంత‌ చైతూల జంటకి చాలా ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో వారు అక్క‌డ ఫాం హౌజ్ కూడా నిర్మించుకోనుండగా ఇకపై ఏ మాత్రం టైమ్ దొరికినా ఈ జంట పక్షులు గోవాలోని వాలిపోనున్నాయి. అయితే, ఈ లోగా ఈ జంటపై విడాకుల రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్న వాటిని నవ్వుతూనే లైట్ తీసుకుంటున్నారు.