Samantha : యశోద ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇన్ని కోట్లా.. మరి సమంత అంత రాబడుతుందా??

యశోద సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యశోద సినిమాకి.............

Samantha : యశోద ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇన్ని కోట్లా.. మరి సమంత అంత రాబడుతుందా??

Samantha Yashoda Movie Pre Release Business

Samantha :  సమంత చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. అది కూడా ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంతకి ఆరోగ్యం సహకరించకపోయినా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, సినిమాని ప్రమోట్ చేస్తుంది. దీంతో సమంత కోసమైనా సినిమా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. యశోద సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యశోద సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లకి, హిందీలో 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1 కోటి రూపాయలకి, ఓవర్సీస్ 2.5 కోట్లకి థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. సమంత ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. మొత్తంగా దాదాపు 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ యశోద సినిమాకి జరిగింది. యశోద సినిమా హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సిందే. మరి సమంత ఫేమ్ ఎన్ని కోట్లని తెస్తుందో చూడాలి.

Hari-Harish : జ్వరంలో కూడా యాక్షన్ సీన్స్ చేసింది సమంత.. సినిమాలో సరోగసి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

అలాగే శాటిలైట్ హక్కులు దాదాపు 10 కోట్లకి, డిజిటల్ హక్కులు దాదాపు 20 కోట్లకి అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తానికి సమంత సినిమాకి బాగానే మార్కెట్ అయింది. సినిమా కూడా ట్విస్టులతో అదిరిపోతుంది అని ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.