శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ధర రూ.1500 తగ్గింది..

శామ్‌సంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ధర రూ.1500 తగ్గింది..

Samsung

samsung galaxy m21 : శామ్‌సంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది. ఇంతకుముందు 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ మోడల్ ఫోన్ 13,999 రూపాయలుగా ఉంది.. అయితే దీనిని ఇప్పుడు రూ.12,499 కు తగ్గించింది. అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఇంతకుముందు రూ .15,999 గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మోడల్ ధర కూడా 14,499 రూపాయలకు పడిపోయింది.

6.4-అంగుళాల ఫుల్-హెచ్డి + (1080 × 2340 పిక్సెల్స్) ఇన్ఫినిటీని కలిగి ఉన్న ఈ ఫోన్ లో 6000 mAh సామర్థ్యం కలిగిన జంబో బ్యాటరీ తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో పని చేస్తుంది. దీనిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 123 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ తోపాటు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది.

సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. అలాగే 128 జిబి వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇక కనెక్టివిటీ ఫీచర్లలో 4 జి VOLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.