Samyuktha Menon : మా నాన్న ఇంటి పేరు నాకు వద్దు అనుకున్నా.. సంయుక్త మీనన్!

మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచమైన నటి సంయుక్త మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బై లింగువల్ మూవీ అయిన 'సార్' మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో...

Samyuktha Menon : మా నాన్న ఇంటి పేరు నాకు వద్దు అనుకున్నా.. సంయుక్త మీనన్!

Samyuktha Menon

Samyuktha Menon : మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచమైన నటి సంయుక్త మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించక పోయిన తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు బై లింగువల్ మూవీ అయిన ‘సార్’ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది.

Samyuktha Menon : టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్.. ఏ హీరో గురించి ఏం చెప్పింది..?

కాగా హీరోయిన్ సంయుక్త మీనన్.. ఇటీవల తన పేరులోని మీనన్ ని తొలిగించింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి వివరణ ఇచ్చింది. “మనం స్కూల్ లో అడ్మిట్ అవుతున్నప్పుడు మన పేరుతో పాటు ఇంటి పేరుని కూడా రాస్తుంటారు. అలాగే సంయుక్త అనే నా పేరు వెనుక మీనన్ రాశారు. ఒక వ్యక్తి పేరు వెనుక ఇటువంటి తోకలు ఎందుకు ఉంటాయో అప్పుడు అర్ధమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అర్ధమైంది. మనిషుల మధ్య సమానత్వానికి ఇంటి పేరు అడ్డు వస్తుంది అని గ్రహించాను.

ఇంటి పేరుని ఎప్పటినుంచో తొలిగించాలి అని అనుకుంటున్నాను. ఇక పై మీనన్ ని నా పేరు వెనుక కొనసాగించేది లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా మీనన్ ని తొలిగించాను. పైగా మా అమ్మానాన్నలు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ పేరుని కొనసాగించడం మా అమ్మకి కూడా ఇష్టం లేదు. ఆమె ఇష్టానికి గౌరవం ఇవ్వాలి అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదురుకున్నాను. అందుకనే ఎమోషనల్ సీన్స్ లో నటించడం నాకు సవాలుగా అనిపిస్తుంది అంటూ తెలియజేసింది.