Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

భారత టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతుందా? పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఆమె దూరం కాబోతుందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. పాక్ మీడియా కూడా దీనిపై పలు కథనాలు ప్రచురిస్తోంది. ఇంతకీ ీ ప్రచారం ఎందుకు మొదలైంది?

Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

Sania Mirza: ఒకప్పటి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతుందా? పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి ఆమె దూరం కాబోతుందా? ప్రస్తుతం ఈ అంశంపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా ఇటీవల చేసిన కొన్ని పోస్టులు కూడా ఈ విషయంలో అనుమానాలకు తావిస్తున్నాయి.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

సానియా-షోయబ్ వ్యవహారశైలి కూడా దీనికి మరో కారణం. 2010 ఏప్రిల్‌లో సానియా-షోయబ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇజహాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇంతకాలం బాగానే సాగిన వీరి వివాహ బంధంలో ఇటీవల విబేధాలు తలెత్తినట్లు సమాచారం. అటు పాకిస్తాన్ మీడియా కూడా ఈ అంశంపై పలు కథనాలు ప్రచురిస్తోంది. ఈ అనుమానాలు బలపరిచేలా ఇటీవల సోషల్ మీడియా వేదికగా సానియా కొన్ని పోస్టులు చేసింది. గత అక్టోబర్ 30న సానియా కొడుకు పుట్టిన రోజు వేడుక దుబాయ్‌లో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని షోయబ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. షోయబ్ షేర్ చేసిన ఫొటోల్లో సానియా కూడా ఉంది. కానీ, సానియా మీర్జా షేర్ చేసిన ఫొటోల్లో కుమారుడు మాత్రమే ఉన్నాడు.

Viral Video: చిరుత పులినే భయపెట్టిన వీధి కుక్క.. చిరుతకు ఎదురు నిలిచి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్

షోయబ్ లేని ఫొటోల్నే సానియా షేర్ చేసింది. అలాగే ఇటీవల తన ఇన్‪స్టా స్టోరీలో ‘ముక్కలైన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లా దగ్గరికి’ అంటూ ఏదో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేసింది. సానియా సోషల్ మీడియా పోస్టుల వల్ల షోయబ్‌తో ఆమెకు సఖ్యత లేదనే విషయం అర్థమవుతోంది. కాగా, ఒక టీవీ షో సందర్భంగా సానియాను షోయబ్ మాలిక్ మోసం చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే సానియా అతడిపై కోపంతో ఉందని పాక్ మీడియా వెల్లడించింది. దీంతో కొంత కాలంగా ఇద్దరి మధ్యా విబేధాలు తలెత్తాయని, చాలా కాలంగా ఇరువురూ విడివిడిగా ఉంటున్నారని కూడా పాక్ మీడియా కథనం. దీంతో త్వరలోనే సానియా-షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారని… కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పుడు కలుసుకుంటున్నారని తాజా సమాచారం. కానీ, తన విడాకులపై ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ సానియా కానీ, షోయబ్ కానీ దీనిపై స్పందించలేదు.