దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా.. షూటింగ్‌కి బ్రేక్..

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కాసేపటికే మరో దర్శకుడితో పాటు యూనిట్ సభ్యలకు కూడా కోవిడ్ సోకిందనే విషయం తెలియడంతో బాలీవుడ్ వర్గాలవారు ఉలిక్కి పడ్డారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, త్వరలోనే ఇంతకుముందు పరిస్థితికి చేరుకుంటాం.. కరోనా కూడా తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగా ఈ వార్తలు వినడంతో సినీ జనాల్లో ఆందోళన నెలకొంది.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా.. షూటింగ్‌కి బ్రేక్..

Sanjay Leela Bhansali Covid Positive: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కాసేపటికే మరో దర్శకుడితో పాటు యూనిట్ సభ్యలకు కూడా కోవిడ్ సోకిందనే విషయం తెలియడంతో బాలీవుడ్ వర్గాలవారు ఉలిక్కి పడ్డారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, త్వరలోనే ఇంతకుముందు పరిస్థితికి చేరుకుంటాం.. కరోనా కూడా తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగా ఈ వార్తలు వినడంతో సినీ జనాల్లో ఆందోళన నెలకొంది.

సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ని తన క్రియేటివిటీతో ఒక శిల్పంలా అత్యద్భుతంగా చెక్కే పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకింది. అలియా భట్ ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’.. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్

ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించగా సంజయ్ లీలా భన్సాలీకి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన వైద్యుల సలహాలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పులువురు యూనిట్ సభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి అలియా భట్‌తో సహా ఎవరికి వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Sanjay Leela Bhansali

ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో, గంగుబాయి అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామటిపుర’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయనున్నామని ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి విడుదల వాయిదా పడే అవకాశముందని సమాచారం.

Alia Bhatt : గంగూబాయిగా అలియా.. ప్రభాస్‌తో పోటీకి సై..