RR Vs PBKS IPL 2021 Sanju : సంజూ సూపర్ సెంచరీ

ఐపీఎల్ 14వ సీజన్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో

RR Vs PBKS IPL 2021 Sanju : సంజూ సూపర్ సెంచరీ

Sanju Samson

RR Vs PBKS IPL 2021 Sanju Samson : ఐపీఎల్ 14వ సీజన్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 54 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఆ సమయానికి అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయి. భారీ టార్గెట్ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగింది. సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి జట్టుని నడిపించాడు. భారీ టార్గెట్ ముందున్నా బెదరలేదు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి జట్టుని నడిపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్.. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను ఆడుకున్నాడు. 50 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. జస్ట్ లో సెంచరీ మిస్ అయ్యాడు. శతకానికి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన రాజస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ బౌలర్లలో చేతర్ సకారియా 3వికెట్లు, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు.