Sridevi Shoban Babu Trailer: హీరోకి నోటివాటం ఎక్కువ.. హీరోయిన్ కు చేతివాటం ఎక్కువ!

యువ హీరో సంతోష్‌ శోభన్‌, వర్ష జంటగా నటించిన మూవీ ’శ్రీదేవి శోభన్​బాబు’. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్ప‌ర‌చుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు.

Sridevi Shoban Babu Trailer: హీరోకి నోటివాటం ఎక్కువ.. హీరోయిన్ కు చేతివాటం ఎక్కువ!

Sridevi Shoban Babu Trailer

Sridevi Shoban Babu Trailer: యువ హీరో సంతోష్‌ శోభన్‌, వర్ష జంటగా నటించిన మూవీ ’శ్రీదేవి శోభన్​బాబు’. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్ప‌ర‌చుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో మంచి రోజులోచ్చాయి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించగా.. తాజాగా ‘శ్రీదేవి శోభన్​బాబు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Sridevi Shoban Babu: మెగా డాటర్ ఫస్ట్ లుక్.. అదిరిందిగా!

ప్రశాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా కొనిదెల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్​ను ‘ఆచార్య’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. న‌మ‌స్కారం మ‌రి కొన్ని విశేషాల‌తో మీ ముందుకు వ‌చ్చాం.. క‌థ‌లో ముఖ్యాంశాలు అనే వాయిస్ ఓవర్ తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. హీరోకి నోటి వాటం ఎక్కువ అంటూ సంతోష్ శోభ‌న్ క్యారెక్ట‌ర్‌, హీరోయిన్‌కు చేతి వాటం ఎక్కువ అంటూ హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ్యూస్ అవుతుంది.

Santosh Shoban : మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. దటీజ్ డార్లింగ్..

వీళ్ళిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ ఛాలేంజ్‌.. గెలిచే స‌మ‌యానికి ఒక స‌మ‌స్య‌. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న క‌థ‌లో, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాలు. మ‌రెన్నో విశేషాల‌తో త్వ‌ర‌లోనే మీ అభిమాన థియేట‌ర్ల‌లో అంటూ అంటూ వ‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌ధ్య‌లో హీరో చెప్పే ఇక్క‌డ మాట‌ల‌తో నెగ్గం బాబాయి.. మూట‌లుంటేనే నెగ్గుతాం అనే డైలాగ్ ఆలోచింప‌జేస్తుంది. ట్రైల‌ర్‌లో క‌మ్ర‌న్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సిద్ధార్థ్ రామస్వామి కెమెరా ప‌నిత‌నం బాగుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.