ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్నచోట నిలబెట్టుకోవడం..

‘ఒకే ఒక లోకం నువ్వే’.. ఈ పాట కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఇప్పటికే 60 మిలయన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్, సురభి జంటగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్.. ‘శశి’..

ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్నచోట నిలబెట్టుకోవడం..

Sashi​ Movie: ‘ఒకే ఒక లోకం నువ్వే’.. ఈ పాట కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్, సురభి జంటగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘శశి’..

Sashi​

Sashi​

బుధవారం ఈ సినిమా టీజర్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కాలేజీలో హీరో హీరోయిన్లు లవ్ చేసుకోవడం, అమ్మాయి తండ్రి పెళ్లి చెయ్యడానికి సందేహించడం, విపరీతమైన కోపం ఉన్న హీరో తనకెదురైన ఇబ్బందులను దాటి తన ప్రేమను ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా కథగా క్లుప్తంగా ట్రైలర్‌లో చూపించారు.
ఆది, సురభిల పెయిర్ బాగుంది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆది కనిపించి ఆకట్టుకున్నాడు.

Sashi​

Sashi​

‘‘మనం ప్రేమించే వాళ్లు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడూ అంతే భయంగా ఉంటుంది.. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతల్ని గెలవాలి.. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్నచోట నిలబెట్టుకోవడం.. మనల్ని ప్రేమించిన వాళ్లు మనల్ని ఎప్పుడూ బాధ పెట్టరు’’.. వంటి మాటలు ఆకట్టుకుంటున్నాయి.. హీరోయిన్ తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. మార్చి 19న ‘శశి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.