CM KCR : సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్

సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ నినాదంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. పనితీరు విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని అడిషనల్ కలెక్టర్లను హెచ్చరించారు ముఖ్యమంత్రి.

CM KCR : సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్

Cm Kcr

CM KCR : సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ నినాదంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. పనితీరు విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని అడిషనల్ కలెక్టర్లను హెచ్చరించారు ముఖ్యమంత్రి. తాను స్వయంగా ఓ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని కేసీఆర్ చెప్పారు. జిల్లాల్లో తక్షణ సమస్యల పరిష్కారానికి వెంటనే 25 లక్షల రూపాయల చొప్పున విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు ఒక యజ్ఞంలా కృషి చేయాలని సూచించారు. అధికారులు తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదని సీఎం హెచ్చరించారు. పనితీరు బేరీజు వేసి, అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేది లేదని తేల్చి చెప్పారు.

ఈనెల 21న వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తానని కేసీఆర్ చెప్పారు. అదే రోజు వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంఖుస్థాపన కూడా చేయనున్నట్లు తెలిపారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 24 అంతస్తులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యవసర చికిత్స కోసం వచ్చే పేషంట్ల కోసం దవాఖానా బిల్డింగ్ పైనే హెలీపాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు 25 లక్షల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఇక గ్రామీణాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ఈ మేరకు కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను, డీపీవోలను ఎంపిక చేసి పంపించాలని సీఎస్ ను ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుందని ఈ సందర్భంగా తెలిపారు. వైకుంఠధామాల రక్షణ కోసం గోడలను కాకుండా గ్రీన్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా సంబంధ సంస్థల పారిశుధ్య బాధ్యతను మున్సిపాలిటి పాలకవర్గాలు తీసుకోవాలని సీఎం అన్నారు.

ప్రకృతి వనాల నిర్మాణం, డంపు యార్డుల నిర్మాణం వివరాలను అడిషనల్ కలెక్టర్లను అడిగి తెలుకున్నారు సీఎం. తెలంగాణలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి చెప్పారు. పట్టణాల్లో మహిళలకు పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ అడిషనల్ కలెక్టర్లకు చెప్పారు.

Read More : Hyderabad Rain : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం