Savitri Jindal: భారతీయ సంపన్న మహిళగా సావిత్రి జిందాల్.. జాబితా వెల్లడించిన ఫోర్బ్స్

2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్‌పర్సన్‌గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.

Savitri Jindal: భారతీయ సంపన్న మహిళగా సావిత్రి జిందాల్.. జాబితా వెల్లడించిన ఫోర్బ్స్

Savitri Jindal: జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్‌పర్సన్‌గా ఉన్న సావిత్రి జిందాల్ భారత సంపన్న మహిళగా నిలిచారు. 2022కు సంబంధించి టాప్-100 బిలియనీర్స్ జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇది మహిళలకు సంబంధించి ప్రపంచ సంపన్నుల జాబితా.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

ఇండియాకు చెందిన తొమ్మిది మంది మహిళలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. మన దేశం నుంచి ఎంపికైన వంద మందిలో సావిత్రి జిందాల్ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో వినోద్ రాయ్ గుప్తా 6.3 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, రేఖా ఝుంఝన్ వాలా 5.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, ఫాల్గుని నాయర్ 4.08 డాలర్లతో నాలుగో స్థానంలో, లీనా తివారీ 3.74 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, దివ్యా గోకుల్‌నాథ్ 3.6 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, మల్లికా శ్రీనివాసన్ 3.4 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో, కిరణ్ మజుందార్ షా 2.7 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో, అను ఆగా 2.23 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

వీరిలో స్వయం కృషితో ఎదిగిన మహిళగా నిలిచారు నైకా సంస్థ అధినేత ఫాల్గుని నాయర్. ఆమె మొత్తం జాబితాలో 44వ స్థానంలో ఉన్నారు. పురుషులకు సంబంధించి గౌతమ్ అదానీ 150 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, ముకేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఒక్క ఏడాదే గౌతమ్ అదానీ సంపద రెట్టింపు కావడం విశేషం.