Safe Online Banking: ఎస్‌బీఐ యోనో లైట్‌లో కొత్త ఫీచర్.. ఇకపై చెల్లింపులు సేఫ్!

మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? యోనో మొబైల్ యాప్ వాడుతున్నారా? ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెక్యురిటీ గురించి అనుమానపడుతున్నారా? ఇకపై అటువంటి అనుమానాలు అక్కర్లేదు.

Safe Online Banking: ఎస్‌బీఐ యోనో లైట్‌లో కొత్త ఫీచర్.. ఇకపై చెల్లింపులు సేఫ్!

Yono Lite

SBI adds a new feature: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? యోనో మొబైల్ యాప్ వాడుతున్నారా? ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెక్యురిటీ గురించి అనుమానపడుతున్నారా? ఇకపై అటువంటి అనుమానాలు అక్కర్లేదు. మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటే, భద్రత కోసం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. సిమ్ బైండింగ్‌ టెక్నాలజీతో యోనో యాప్ ఇప్పుడు సెక్యురిటీ పరంగా అవాంతరాలు అధిగమించనుంది.

ఇప్పటికే మీరు ఈ యాప్‌ని ఉపయోగిస్తూ ఉంటే మాత్రం ఒక్కసారి యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా మీరు కొత్త ఫీచర్ ప్రయోజనాన్ని పొందుతారు. డిజిటల్ లావాదేవీల విషయంలో మోసాలకు అడ్డుకట్ట వెయ్యడానికి ఎస్‌బీఐ ఈమేరకు కొత్త నిర్ణయాలతో. కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రత పటిష్టంగా తయారవుతుంది. కస్టమర్‌గా మీరు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను సురక్షితమైన పద్ధతిలో పూర్తి చేసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

యోనో లైట్ అంటే..
యోనో లైట్ అంటే స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎస్‌బీఐ రూపొందించిన రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆధారిత అప్లికేషన్.. సురక్షితమైన, అనుకూలమైన విధానంలో ట్రాన్సాక్షన్స్ చెయ్యడానికి ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.

సిమ్ బైండింగ్ ఏమిటి?
ఇది క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఇది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో పరికరానికి ఒక వినియోగదారుని మాత్రమే అనుమతిస్తుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను గతంలో కంటే మరింత సురక్షితంగా చేస్తుంది. యోనో లైట్ యాప్‌లో ఈ ఫీచర్ కోసం 5.3.48తో అప్ డేట్ చెయ్యాలి. మీ ఫోన్‌లో అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.