Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Remove Apps

Remove Apps : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్ లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలంది. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌లను ఫోన్‌లో వాడొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఈ యాప్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు “ఖాళీ” చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత నాలుగు నెలల్లోనే మోసగాళ్లు చెప్పిన మాటలు విని వాటిని డౌన్ లోడ్ చేసిన వ్యక్తులు కనీసం 150 మంది ఎస్​బీఐ వినియోగదారులు రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు బ్యాంకు తెలిపింది.

Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?

ఇలాంటి కేసుల సంఖ్య రోజు రోజుకి పేరుగుతుండటంతో ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. వారి ఫోన్లలో ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేయొద్దని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని బ్యాంక్ సూచించింది. అలాగే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ)ని ఉపయోగించేటప్పుడు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని సోర్స్ నుంచి క్యూఆర్‌ కోడ్‌ లేదా యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ వస్తే వాటిని తిరస్కరించాలని స్పష్టం చేసింది.

Debit Cards : నో నెట్‌వర్క్.. ఆఫ్‌లైన్‌లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!

అలాగే ఎస్బీఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు ఉన్నాయని ఎస్బీఐ చెప్పింది. ఎస్బీఐ హెల్ప్‌ లైన్‌ లేదా కస్టమర్‌ కేర్‌ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్‌సైట్ల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. ఏ సమస్య పరిష్కారం కోసమైనా మా అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించండని సూచించింది. మీరు వాడే వెబ్‌సైట్‌ సరైనదే అని నిర్థరణకు వచ్చాకే, మీ వివరాలు తెలియజేయండని ఖాతాదార్లకు తేల్చి చెప్పింది. అంతేకాదు డిజిటల్‌ లావాదేవీ పూర్తయ్యాక వినియోగదారుకి ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుందని, ఒకవేళ ఆ లావాదేవీ వాళ్లు నిర్వహించకుంటే వెంటనే ఆ ఎస్‌ఎమ్‌ఎస్‌లోని నెంబర్ కు ఆ మెసేజ్‌ను తిరిగి పంపించాలంది.

ఒకవేళ ఏదైనా సైబర్ మోసం జరిగినట్ల గుర్తిస్తే, ఎస్బీఐ ఖాతాదారులు 1800111109, 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. అలాగే, 155260 నెంబర్ కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చంది.