హోమ్ లోన్స్‌పై ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్

హోమ్ లోన్స్‌పై ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్

SBI bumper offer for home buyers: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే సొంతిల్లు కట్టుకోవడం అంత సులభం కాదు. భారీ మొత్తం అవసరం అవుతుంది. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవాలి. అయితే బ్యాంకులు వేసే ఇంట్రస్ట్ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు గురించి తెలిస్తే గుండెలో వణుకు పుడుతుంది. ఏ బ్యాంకైనా తక్కువ వడ్డీ రేటుతో, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా హోంలోన్స్ ఇస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. అలాంటి వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది.

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. హోమ్ లోన్స్ పై ఈ ఏడాది(2021) మార్చి వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజుని రద్దు చేసింది. అంతేకాదు 6.8శాతం వ‌డ్డీతో గృహ రుణాలు అందిస్తోంది. హోమ్ లోన్స్ విభాగంలో దేశం మొత్తం మీద 34శాతం మార్కెట్ వాటాను సాధించాల‌ని ఎస్బీఐ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ ఆమోదించిన ప్రాజెక్టుల‌లో గృహ రుణాలు పొందే వినియోగ‌దారుల కోసం ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. హోమ్స్ లోన్స్ ని మరింత సుల‌భ‌త‌రం చేయ‌డం కోసం తమ బ్యాంక్ అంతిమ మార్గంగా ప‌నిచేస్తుంద‌ని ఎస్బీఐ తెలిపింది.

2020 డిసెంబ‌ర్ నాటికి `పీఎమ్ఎవై` (ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న) స‌బ్సిడీని దాదాపు 2 ల‌క్ష‌ల గృహ రుణ‌దారుల‌కు అంద‌చేసింది. ఈ స‌బ్సిడీని ప్రాసెస్ చేయ‌డానికి సెంట్ర‌ల్ నోడ‌ల్ ఏజెన్సీగా గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ నియ‌మించిన ఏకైక బ్యాంకు ఎస్‌బీఐ. 2022 నాటికి అంద‌రికి ఇళ్లు అనే ప్ర‌భుత్వ నినాదానికి మ‌ద్ద‌తుగా, ఎస్‌బీఐ `పీఎంఎవై` కింద హోమ్ లోన్స్ మంజూరు చేసింది. హోమ్ లోన్ బిజినెస్ ని మాత్ర‌మే కాకుండా ఇత‌ర వ్యాపారాల‌ను కూడా ముందుకు న‌డిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌గ‌ల ఏ1, క్లౌడ్‌, బ్లాక్ చెయిన్‌, మెషిన్ లెర్నింగ్‌ను అమ‌లు చేయ‌డంపై కూడా ఎస్‌బీఐ చూస్తోంది.

5 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌:
కొత్త‌గా హోంలోన్ కావాల‌ని అనుకునే వాళ్లు 72089 33140 నంబ‌ర్‌కు మిస్ కాల్ ఇస్తే మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని ఎస్‌బీఐ వెల్ల‌డించింది. హోంలోన్ బిజినెస్‌లో ఎస్‌బీఐ ఇప్ప‌టికే రూ.5 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. 215 కేంద్రాల‌లో సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్స్‌, బ్యాంక్ డిజిట‌ల్ లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం, యోనో ద్వారా విస్త‌రించ‌బ‌డిన శాఖ‌ల అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించ‌డంతో, ఎస్‌బీఐ ఈ మార్కుని తాకింది. 2024 క‌ల్లా దీనిని రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశ‌గానే అతి త‌క్కువ వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫ‌ర్లు ఇస్తోంది. సాధార‌ణ హోంలోన్ల‌తో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోంలోన్‌, ఆర్మీ, ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోంలోన్‌ల‌తోపాటు ఎస్‌బీఐ స్మార్ట్‌హోమ్‌, ఎస్‌బీఐ ఎన్నారై హోంలోన్‌ లాంటివి అందిస్తోంది ఎస్బీఐ.