కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త

తెలంగాణలో కరోనావైరస్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక స్థాయిలో

  • Published By: naveen ,Published On : May 18, 2020 / 03:01 AM IST
కరోనా మహిళ డబ్బు డ్రా చేసింది, బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యింది, బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త

తెలంగాణలో కరోనావైరస్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక స్థాయిలో

తెలంగాణలో కరోనావైరస్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి ఓ బ్యాంకును తాకింది. శనివారం(మే 16,2020) డబ్బు కోసం జియాజిగూడలోని పురానాపూల్ ఎస్బీఐ బ్యాంక్‌కు ఓ మహిళ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో తక్షణం స్పందించిన అధికారులు బ్యాంకు సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. బాధిత మహిళ కంటైన్మెంట్ జోన్ నుంచి నేరుగా బ్యాంకుకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. బ్యాంకులో మొత్తం 11 మంది సిబ్బంది ఉన్నారు.

హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగులు జాగ్రత్త:
కరోనా సోకిన మహిళ బ్యాంకుకి రావడం, బ్యాంకు సిబ్బందిని క్వారంటైన్ కు తరలించడం తెలిసి ఇతర బ్యాంకుల్లో పని చేసే సిబ్బందిలో కలకలం రేపింది. వారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు పనుల నిమిత్తం ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో ఆఫీస్ కి వెళ్లి పని చేయాలంటే భయపడుతున్నారు. కాగా, విధుల్లో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బ్యాంకులకు వెళ్లే వారూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. భౌతిక దూరం పాటించేలా బ్యాంకు సిబ్బంది చర్యలు తీసుకోవాలి. మాస్కు ధరించేలా నిబంధన పెట్టాలి. ఇలాంటి జాగ్రత్తలతో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

నగరంలో ప్రధానంగా జియాగూడ, మాదన్నపేటలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కంటైన్ మెంట్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కొత్తగా 42 కేసులు నమోదు:
ఆదివారం(మే 17,2020) రాష్ట్రంలో కొత్తగా మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో 37 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస ప్రజల కేసులు 2 నమోదయ్యాయి. దీంతో వలసల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1,551కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం మరో 42 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లిన వారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 34మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి. గత 14 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదవని జిల్లాలు 25 ఉన్నాయి. 

కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువ:
రాష్ట్రంలో మే నెల 16 నాటికి 23,388 నమూనాలను కరోనా నిర్ధారణ కోసం పరీక్షించారు. ఇందులో పురుషులవి 15203 కాగా, వీటిల్లో 947 మందిలో కరోనా పాజిటివ్ గా తేలింది. మహిళల్లో 8,185 నమూనాలను పరీక్షించగా, 566 మందిలో వైరస్ ను నిర్ధారించారు. వయస్సుల వారీగా పరిశీలించినా.. మహిళల కంటే పురుషుల్లో ఎక్కువ మంది పాజిటివ్ లుగా నిర్ధారణ అయింది.

Read Here>> Corona కేసులు పెరగకూడదని ఆంధ్ర నుంచి తెలంగాణకు నో ఎంట్రీ