Shree Padmanabha Swamy Temple : ఆలయం ఆడిట్ 3 నెలల్లోగా పూర్తి చేయాలి

ప్రత్యేక ఆడిట్‌ నుంచి శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ  తిరువనంతపురంలోని ఆలయ ట్రస్ట్‌ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

Shree Padmanabha Swamy Temple : ఆలయం ఆడిట్ 3 నెలల్లోగా పూర్తి చేయాలి

Padmanabha Swany Temple

Shree Padmanabha Swamy Temple :  ప్రత్యేక ఆడిట్‌ నుంచి శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ  తిరువనంతపురంలోని ఆలయ ట్రస్ట్‌ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆదేశించిన ఆడిట్ కేవలం దేవాలయానికి మాత్రమే పరిమితం కాదని, ట్రస్ట్ కూడా వర్తింస్తుందని స్పష్టం చేసింది. ఆడిట్ మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది.

గతేడాది కోర్టు ఆలయ నిర్వహణను మాజీ ట్రావెన్ కోర్ రాజకుంటుబానికి చెందిన కమిటీకి అప్పగించింది. దీంతో పాటు 25 ఏళ్ళపాటు ఆలయానికి సంబంధించిన ఆడిట్ వివరాలను సమర్పించమని కోరింది. ఆడిట్ నుంచి మినహాయించాలని రాజకుటుంబం గతేడాది సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ని విచారించింది. మూడు నెలల్లోగా ఆడిట్‌ పూర్తి కావాలని స్పష్టం చేసింది. అలానే ఆడిట్‌ అనేది కేవలం ఆలయానికి సంబంధించి మాత్రమే కాక ట్రస్ట్‌ కూడా వర్తిస్తుందని తెలిపింది. 2015 నాటి ఆర్డర్‌లో నమోదైన కేసులోని అమికస్ క్యూరీ నివేదికల నేపథ్యంలో ఈ చర్యను చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్‌ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.