Maharashtra Crisis: తేలని ‘మహా’ పంచాయితీ.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు స్టే

ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Maharashtra Crisis: తేలని ‘మహా’ పంచాయితీ.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు స్టే

Maha Crisis

Maharashtra Crisis: మహారాష్ట్రలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ఆదేశించింది. దీంతో ఉద్ధవ్ థాక్రేతోపాటు, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లైంది. మరోవైపు షిండే వర్గానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, దీనిపై అత్యవసరంగా విచారించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణ అనేక పిటిషన్లతో ముడిపడి ఉన్న కారణంగా, దీనికోసం ప్రత్యేక బెంచ్ అవసరమని, అందువల్ల వీటి విచారణకు కొంత సమయం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ జరిపింది.

AP-JANASENA: వైసీపీ ఎంపీటీసీపై జనసేన భూ కబ్జా ఆరోపణలు.. స్పందించిన ప్రభుత్వం

ఉద్ధవ్ థాక్రే తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లలో తమ ఎమ్మెల్యేపై కొత్తగా ఎన్నికైన స్పీకర్ అనర్హత వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరారు. అలాగే షిండే వైపు వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతోపాటు, షిండే ఎన్నికకు వ్యతిరేకంగా ఉద్ధవ్ వర్గం పిటిషన్లు దాఖలు చేసింది.